Home జాతీయం భార‌త చ‌రిత్ర‌లో ఎమెర్జీన్సీ… 676 చీక‌టి రోజులు

భార‌త చ‌రిత్ర‌లో ఎమెర్జీన్సీ… 676 చీక‌టి రోజులు

106
0
ఎమెర్జెన్సీ రోజుల్లోని ఒక సంఘ‌ట‌న (ఫైల్‌ఫొటో)

అది 1975 జూన్ 25 అర్థ‌రాత్రి కావ‌డానికి 15 నిమిషాల ముందు.. భార‌త్‌లో చీక‌టి రోజుల‌కు అంకురార్ప‌ణ‌ జ‌రిగింది. త‌నను ప్ర‌శ్నిస్తున్నార‌న్న ఏకైక కార‌ణంతో.. ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిర ఒక్క క‌లం పోటుతో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించారు. భార‌త‌జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాల‌ను హ‌రించి వేశారు. త‌న‌కు వ్య‌తిరేకంగా నిలిచిన వారంద‌రినీ జైళ్ల‌ల్లో పెట్టారు. ప‌త్రిక‌లపై ఆంక్ష‌లు.. అలా 676 రోజులు దేశంలో ప్ర‌జాస్వామ్యం చీక‌టిలో మ‌గ్గిపోయింది. దేశంలో ఎమెర్జెన్సీ ఇందిర విధించ‌డానికి గ‌ల కార‌ణాలు సంక్షిప్తంగా

రాయ్‌బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారు.
ఇందిర ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌గ‌న్‌మోహ‌న్ సిన్హా తీర్పు వెలువ‌రించారు.
హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఇందిర‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

1975 జూన్ 25న జస్టిస్‌ కృష్ణ అయ్యర్ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు.
ఈ ఉత్త‌ర్వుల ప్రకారం ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలో ఇందిర ఉండ‌వ‌చ్చు. కానీ ఎంపీగా కొనసాగ‌రాదు. పార్ల‌మెంట్లో మాట్లాడే అవ‌కాశ‌మున్నా.. ఓటింగ్‌లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌దు.
మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల ప్ర‌కారం తుది తీర్పు ఇందిర‌కు వ్య‌తిరేకంగా ఉంటుంద‌న్న అభిప్రాయానికి ప్ర‌తిప‌క్షాలు వ‌చ్చాయి. అదే అభిప్రాయానికి ఇందిర కూడా వ‌చ్చారు. దీంతో నాటి రాష్ట్ర‌ప‌తి ఫ‌క్రుద్ధీన్ అలీ అహ్మ‌ద్ ద్వారా 1975 జూన్ 25 రాత్రి 11.45 నిమిషాల‌కు ఎమెర్జీన్సీ విధింప‌జేశారు. ఇది 1977 మార్చి 21 వ‌ర‌కూ కొన‌సాగింది.

ఈ మ‌ద్య కాలంలో ఇందిర, ఆమె కుమారుడు సంజయ్ పెత్త‌నం కొన‌సాగింది.
అన్ని ఎన్నిక‌లు నిలిపివేశారు.
పత్రిక‌ల‌పై సెన్సార్ విధించారు.
అంతర్గత భద్రతా వ్యవహారాల చట్టం, 1971 (మిసా) కింద రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంద‌రినీ జైల్లో వేశారు.
మ‌హిళ‌ల‌కు బ‌ల‌వంతంగా అబార్ష‌న్లు వంటి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేశారు. 676 చీక‌టి రోజుల త‌ర్వాత‌ చివ‌ర‌కు ప్ర‌జాఒత్తిడికి తలొగ్గి 1977 మార్చి 21న ఎత్తివేశారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇందిరను ప్ర‌జ‌లు ఓడించారు. మొరార్జిదేశాయ్ నేతృత్వంలో జ‌న‌తాపార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటైంది. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య అభిప్రాయ‌బేధాల కార‌ణంగా రెండేళ్ల‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here