Home ద లీడర్ భారత స్వాతంత్య్రోధ్యంలో మోహన్​దాస్​ కరమ్​చంద్​ గాంధీ – భిన్నాభిప్రాయాలు

భారత స్వాతంత్య్రోధ్యంలో మోహన్​దాస్​ కరమ్​చంద్​ గాంధీ – భిన్నాభిప్రాయాలు

224
0
గాంధీ ఫొటోలను ఇంటర్నెట్​ నుంచి తీసుకోవడం జరిగింది.
  • వికాస్​ రుషి

ప్రపంచంలో సాధారణ వ్యక్తిగా కన్పిస్తూ అసాధారణ ఉద్యమకారుడిగా మోహన్​దాస్​ కరంచంద్​ గాంధీ (1869 అక్టోబర్​ 02 – 1948 జనవరి 30) నిలిచారు. ఒంటిపై చొక్కాలేకుండా.. దోతి కట్టుకొని చేతిలో భగవద్గీత పట్టుకొని భారతదేశానికి స్వాంతంత్ర్యం కోసం శాంతియుతంగా  పోరాటం చేసి.. సాధించారు బాపుగా ప్రజలచే పిలిపించికున్న  గాంధీ. 20వ శతాబ్దంలో ప్రపంచంలో అనేకమందిని ప్రభావితం చేసిన వ్యక్తిగా గాంధీ నిలిచారు. శతృపక్షం ఆయుధాలు ధరించి.. స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న వారిని అమానుషంగా హత్యలు చేస్తున్నా.. చలించకుండా.. శాంతియుతంగా ముందుకు సాగి.. బ్రిటీష్​ పాలకులకు ఎదురొడ్డారు. చివరకు స్వాతంత్ర్యం సాధించి అజేయుడిగా నిలిచారు. స్వాతంత్ర్యోద్యమంలో అనేక మంది ఉద్యమకారుల పాత్ర ఉన్నా.. ఒక్క గాంధీకే ఆ ఖ్యాతిని అపాదించడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన పరోక్షంగా బ్రిటీష్​ పాలకులకు సహకరించారన్న ప్రచారమూ ఉంది. ఉద్యమ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు గురైంది. స్వాతంత్య్రం రాక ముందు భగత్​సింగ్​, సుభాష్​ చంద్రబోస్​ వంటి వారిని.. వచ్చిన తరువాత బాబాసాహెబ్​ అంబేడ్కర్​ వంటి వారిని వ్యతిరేకించారని కూడా ప్రచారం ఉండనే ఉంది. చేతిలో భగవద్దగీత ఉన్నా.. పరోక్షంగా ఇతర సామాజిక వర్గాలనే బలపర్చారన్న కారణంగానే..గాంధీని నాథూరామ్​ గాడ్సే హత్య చేశారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కథనంలో గాంధీని కించపరచాలని కాదు. కానీ అప్పట్లో జరిగిన ప్రచారాన్ని మాత్రమే అది కూడా అక్కడక్కడ ప్రస్తావిస్తున్నాం.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 శనివారం (శుక్ల నామ సంవత్సరం బాధ్రపద బహుళ ద్వాదశి) గుజరాత్ లోని పోర్ బందర్​ కరంచంద్ గాంధీ. పుత్లీబాయి దంపతులకు జన్మించారు. అప్పటి సంప్రదాయం ప్రకారం ఆయనకు 13వ ఏటే.. కస్తురీభాతో వివాహం జరిగింది. 19 ఏళ్ల వయసులో (1888) లా కోర్సు చదవడానికి ఇంగ్లాండ్​కు వెళ్లారు. 1891లో తిరిగి దేశానికి వచ్చారు. బొంబాయి(ఇప్పటి ముంబాయి), రాజ్​కోట్​లో లాయర్​గా ఆయన ప్రాక్టీస్​ ప్రారంభించినా… సక్సెస్​ కాలేదు. 1893లో ఆయన దక్షిణాఫ్రికాలోని నాటల్​లో ఏడాది పాటు కాంట్రాక్ట్​ పద్దతిలో నాటల్​లోని లా కంపెనీలో పని చేశారు. ఆ తరువాత 1893 నుంచి 1920 వరకూ అంటే 23 ఏళ్లు  అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయనను నల్ల జాతీయుడని అవమానకరంగా ట్రైన్​ నుంచి బయటకు నెట్టివేశారు. ఆ తరువాత నల్ల జాతీయులు అనేక అవమానాలు ఎదుర్కోవడాన్ని ఆయన చూశారు. వాటిని ఎదుర్కొవడానికి అనేక విధంగా ప్రయత్నాలు చేశారు. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచేందుకు దక్షిణాఫ్రికాలో రూపొందించిన బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయనలోని నాయకుడు వెలుగు చూశారు. ‘ఇండియన్​ ఒపీనియన్​’ పత్రికను ప్రచురిస్తూ అక్కడి భారతీయులకు అండగా నిలిచారు. శాంతియుతంగా ఆయన పోరాటాలు నిర్వహించారు. అక్కడి భూగర్భ గనుల్లో భారతీయులకు జరగుతున్న అన్యాయంపై ‘సత్యాగ్రహం’ ప్రారంభించారు. ఏడేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న భారతీయులు 1913లో జైళ్లకు వెళ్లారు. ఆ తరువాతే దక్షిణాఫ్రికా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఇదే సమయంలో బ్రిటీష్​ పాలకులను కొన్ని సందర్భాల్లో సమర్ధించారన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒకవైపు పోరాటం చేస్తూనే మధ్యలోనే ఆపి.. బ్రిటీష్​ పాలకులను  మరోవైపు సమర్ధించడంపై విమర్శలున్నాయి. అదే సమయంలో ఆయనకు ప్రభుత్వం పథకాలు ఇచ్చి సత్కరించడం ఇక్కడ గమనార్హం. 

దేశానికి గాంధీ 1914లో తిరిగి వచ్చారు. ఈ సందర్భంలోనే దేశంలో స్వాతంత్ర్య కాంక్ష పెరిగిపోయి ఉద్యమ రూపం సంతరించుకుంటోంది. ఉద్యమంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనడం ప్రారంభించారు.  అప్పటి వరకూ కాంగ్రెస్​ ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ  గోఖలే..  గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. ఇది చాలా మందికి నచ్చలేదు. అదే సమయంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్​ పాలకులను గాంధీ సమర్ధించారని, సైన్యంలో చేరాలని అనేక మందిని ప్రోత్సహించారని ఆనాటి బహిరంగ రహస్యమని.. దీనిని కాంగ్రెస్​లో అనేకమంది వ్యతిరేకించారన్న ప్రచారమూ ఉంది. అదే సమయంలో ప్రజలపై బ్రిటీష్​ పాలకులు పన్నులు విధించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించి1918లో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడంతో పాటు వారికి చదువు, సంస్కారాన్నీ నేర్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. జాతి వివక్షతను విడనాడడం, అన్యాయాన్ని ఖండించడం కూడా ఈ సత్యాగ్రహంలో ఒక భాగము.  గాంధీకి కుడిభుజంగా  ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలిచారు. పటేలే కాదు ఎవరు ఎంత చేసినా.. అన్ని గాంధీ ఖాతాలోనే ఇవన్నీ చేరాయన్నది కూడా నిజమే. గాంధీ ఏం చెప్పినా.. ప్రజలు ఆయన వెన్నంటి వెళ్లారు. బ్రిటీష్​ పాలకులకు  ఎదురు నిలిచి, జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీని అరెస్టు చేసినపుడు పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. దీంతో సర్కారు ప్రజల నిరసన ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పుకున్నది. ప్రజలు తీవ్రస్థాయిలో బ్రిటీష్​కు ఎదురొడ్డి నిలిచి పోరాటం నిర్వహించిన సమయంలో ఆయన మధ్యలోనే కొన్నింటిని నిలిపి.. నిరాహారదీక్ష చేశారు. దీనిపై కొందరు అప్పట్లోనే విమర్శించారు. ఇతరులు ఉద్యమం చేయకూడదన్న ఉద్దేశం గాంధీకి ఉన్నదన్న ప్రచారం చేశారు. అయితే హింసకు ప్రతి హింసను కూడా ఆయన వ్యతిరేకించారు కాబట్టే.. నిరహార దీక్ష చేశారని గాంధీ అనుచర వర్గం వాదించేది. 1919 ఏప్రిల్​ 13న పంజాబ్​లోని జలియన్​వాలా బాగ్​లో సామాన్య ప్రజలపై బ్రిటీష్​ సైన్యం జరిపిన కాల్పుల కారణంగా 400 మంది భారతీయులు హత్యకు గురికాబడ్డారు. ఈ సమయంలో గాంధీ ప్రవచించే శాంతిని అందరూ వ్యతిరేకించినా.. గాంధీ మాత్రం శాంతి స్పూర్తితోనే ముందుకు సాగారు. విధిలేని పరిస్థితుల్లో అనేక మంది ఆయనను అనుసరించారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో పర్యటనలో గాంధీ చేసిన ప్రసంగం తెలుగు ప్రజలను ఉత్తేజులను చేసింది.  

1921లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకుడిగా నిలిచారు. స్వదేశీ నినాదంతో విదేశీ వస్తువులను బహిష్కరించే విధంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. స్వదేశీ వస్తువులను వాడాలని, అందరూ ఖద్దరు దుస్తులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరాలో హింస చోటు చేసుకున్నది దీంతో ఆయన వెంటనే సహాయ నిరాకరణ నిలిపివేశారు. అదే సమయంలో గాంధీ రెండేళ్లు జైల్లో గడిపారు. కాంగ్రెస్​లో అతివాద. మితవాద వర్గాల మధ్య విబేధాలు పెరిగిపోయాయి. దేశంలో మతపరమైన వైషమ్యాలు పెరిగిపోయాయి. దీన్ని చక్కదిద్దడం కోసం  1924 లో మూడు వారాల నిరాహారదీక్ష చేశారు. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించేందుకు ఉద్యమాలు నిర్వహించారు. 1927 లో సైమన్ కమిన్​కు వ్యతిరేకంగా సాగిన పోరాటంతో  గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించారు.  1928లో కలకత్తా కాంగ్రెసులో “స్వతంత్ర ప్రతిపత్తి” తీర్మానాన్ని కూడా ఆయన  ఆమోదింపజేశాడు. దేశానికి స్వాంతంత్ర్యం ఇవ్వాలని బ్రిటీష్​ పాలకులకు ఏడాది గడవు ఇచ్చారు గాంధీ. అయినా పాలకుల నుంచి స్పందన లభించలేదు. 1929 డిసెంబర్ 31 న లాహోరులో స్వతంత్ర పతాకం ఎగురవేశారు. 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించారు.  ఆరోజే స్వాతంత్ర్యం కోసం చివరి పోరాటం ప్రారంభమైందని చెప్పుకున్నారు.

ఉప్పు సత్యాగ్రహం

 ఉప్పుపై బ్రిటీష్​ పాలకులు విధించిన పన్నును గాంధీ వ్యతిరేకించారు. 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడము ఈ సత్యాగ్రహం ఉద్దేశం.. మార్చి 21 నుంచి  ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుంచి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు 60,000 మందిని జైల్లో పెట్టారు.1931లో గాంధీ.. ఆనాటి బ్రిటీష్​ ప్రతినిధి లార్డ్​ ఇర్విన్​ మధ్య  కుదిరిన ఒప్పందం ప్రకారం సత్యాగ్రహాన్ని ఆపివేశారు. 1932లో లండన్​లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు నుంచి ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరైనప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. లార్డ్ ఇర్విన్ తరువాత బ్రిటీష్​ ప్రతినిధిగా వచ్చిన లార్డ్ విల్లింగ్డన్.. స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించారు. దళితులను.. ముస్లింలను వేరు చేయడానికి 1932లో  ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకించిన గాంధీ.. ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో అంటారాని వారిగా పిలవడబడుతున్న దళితులను.. హరి (భగవంతుడు) ప్రతినిధులుగా పలికే విధంగా ‘ హరిజనులు’ అని పిలిచే విధంగా పిలపునిచ్చారు. ఇప్పుడు హరిజనులని పిలవడం లేదు. దీనికి బదులుగా ఎస్సీలుగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిలేంచేందుకు 1933 మే 8 నుంచి 21 రోజుల పాటు నిరవధిక నిరాహారదీక్ష కొనసాగించారు గాంధీ.

స్వాంతంత్య్రం రాకముందే అంటే 1934లో ఆయనపై మూడుసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్​ పద్దతిలో కాంగ్రెస్​లో సంస్థాగతమైన ఎన్నికలు జరిగినప్పుడు గాంధీ.. తప్పుకున్నారు. అయితే ఇది స్వాంతంత్ర్య ఉద్యమం కోసమని గాంధీ అనుచరులు వాదించినా.. తన పెత్తనం పోతుందన్న కారణంగానే తప్పుకున్నారని మరికొందరు వాదించారు. అందుకు సాక్ష్యంగా 1936లో లక్నో జరిగిన కాంగ్రెసు సమావేశంలో మళ్లీ గాంధీ ప్రముఖ పాత్ర పోషించడాన్ని చూపెడతున్నారు.  1938లో కాంగ్రెస్​ అధ్యక్షుడిగా సుభాస్ చంద్రబోస్​ ఎన్నికయ్యారు. ఆయనతో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. శాంతియుతంగా సాధ్యం కాదని ఆయుధంతో స్వాంతంత్ర్యం వస్తుందనేదీ బోస్​ వాదన. దీన్ని వ్యతిరేకించిన గాంధీ.. ఆయనకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది ఆరోపణ చేశారు. గాంధీ నుంచి వ్యతిరేకత వచ్చినా.. కాంగ్రెస్​ వాదులు.. బోస్​ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తరువాత గాంధీ.. వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్​లో తీవ్ర సంక్షోభాలు సంభవించాయి. దీంతో.. కాంగ్రెస్​కు సుభాష్​ పూర్తిగా దూరమయ్యారు.

రెండో ప్రపంచ యుద్ధం

1939లో ప్రారంభమైన  రెండవ ప్రపంచ యుద్ధంలో తమను సంప్రదించకుండానే.. దేశాన్ని యుద్ధంలో పాల్గొనేట్టుగా బ్రిటీష్​ పాలకులు చేయడాన్ని కాంగ్రెస్​ ప్రతినిధులు వ్యతిరికించారు. మా స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, స్వేచ్ఛ పేరుతో బ్రిటీష్​ పాలకులు యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంటు నుంచి  కాంగ్రెస్​ ప్రతినిధులు రాజీనామా చేశారు. ఇక  బ్రిటిష్ పెత్తనం మాకు అవసరం లేదని వెంటనే వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో “క్విట్ ఇండియా” ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో.. హింస కూడా పెరిగింది. ఉద్యమం తీవ్రత ఎంతుందో అదే స్థాయిలో కాంగ్రెస్​లో కూడా అంతర్గత విబేధాలు పెరిగాయి. ‘భారత్ ఛోడో’ అన్న నినాదంతో  ఉద్యమ తీవ్రత పెరిగింది. శాంతియుతంగా జరుగుతున్నా.. ‘కరో యా మారో’ అంటూ ఉద్యమించారు. భారత్​కు స్వాతంత్ర్యం ఇవ్వవద్దన్న ఉద్దేశంతో ఉన్న బ్రిటీష్​ పాలకులు.. ఉద్యమాన్ని తీవ్రంగా అణిచి వేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమంలో భాగంగా 1942 ఆగష్టు 9 న గాంధీ సహా కాంగ్రెస్​ కార్యవర్గాన్ని పూర్తిగా అరెస్ట్​ చేసింది.  గాంధీని రెండేళ్ల పాటు పూణే జైల్లో నిర్భంధించారు. అదే  సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించారు. గాంధీ భార్య  కస్తూరీ బాయి కూడా 18 నెలల జైలు జీవితం అనుభవించి మరణించారు.  గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించించడంతో ఆయనను 1944లో విడుదల చేశారు.

సిద్ధించిన సాంతంత్ర్యం– దేశ విభజన

భారత్​కు స్వాతంత్ర్యం ఇస్తే.. ముస్లింలు మెజారిటీగా ఉన్నప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని బ్రిటీష్​ కేబినెట్​ 1946లో ‘మిషన్​’ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను గాంధీ వ్యతిరేకించారు. కానీ వ్యతిరేకిస్తే.. పెత్తనం ముస్లింలీగ్​ చేతికి వెళ్తుందన్న కారణంతో.. నెహ్రూ, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​..  గాంధీ వ్యతిరేకతను పట్టించుకోకుండా.. బ్రిటీష్​ కేబినెట్​ తెచ్చిన ప్రతిపాదనను అంగీకరించారు. ఇదే సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల కారణ:గా ఐదు వేల మంది మరణించారు.  భిన్న మతాల ప్రజలు కలిసి ఉన్న దేశాన్ని విభజించకూడదన్న వాదనతో గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ముస్లిం లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నాకు పశ్చిమ పంజాబ్​, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్​ ప్రాంతాల్లో ఆదరణ ఉంది. అవసరమైతే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ కోరిక. కానీ జిన్నా మాత్రం దేశాన్ని విభజించాలని.. లేకుంటే దేశంలో అంతర్గత యుద్ధం తలెత్తుతుందని హెచ్చరించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దేశ విభజనకే నెహ్రూ, వల్లభాయ్​ పటేల్​ అంగీకరించారు. చివరకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందరూ సంబురాల్లో మునిగి ఉంటే.. గాంధీ మాత్రం కోల్​కతాలోని ఎస్సీ(హరిజన వాడ) కాలనీని శుభ్రం చేస్తూ గడిపారు. అయితే తన మాటను వినకుండా దేశ విభజన చేశారన్న కారణంగా అలా నిరసన వ్యక్తం చేశారన్న ప్రచారమూ ఉంది.

మత విధ్వేషాలు –గాంధీ నిరాహార దీక్ష

దేశవిభజన కారణంగా పంజాబ్, బెంగాల్కు పెద్ద ఎత్తున ప్రజలు వలస వచ్చారు.    హిందూ ముస్లింల మధ్య పెద్ద అగాథం ఏర్పడింది. ప్రభుత్వం కూడా పరిస్థితిని అదుపు చేయలేని నిస్సాహ స్థితిలో పడింది.  1947లోనే కాశ్మీర్​ విషయంలో  భారత్.. – పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఇక కలిసి బతకడం అసాధ్యమని ముస్లిములందరినీ పాకిస్తాన్​కు పంపాలన్న నిర్ణయానికి కాంగ్రెస్​ నాయకులు వచ్చారు. ఇదే సమయంలో దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్థాన్​కు ఇవ్వాల్సిన రూ. 55 కోట్లు ఇవ్వలేమని భారత్​ నిరాకరించింది. ఈ డబ్బు ఇస్తే.. తిరిగి యుద్ధం చేయడానికే.. పాకిస్థాన్​ ఉపయోగిస్తుందని అందుకే ఇవ్వమని పటేల్​ చెప్పేశారు. కానీ ఈ విషయంలో గాంధీ మాత్రం పాకిస్థాన్​కు అనుకూలంగా నిలిచి.. రూ. 55 కోట్లు ఇవ్వాల్సిందే అని నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎవరెంత బతిమాలినా.. ఆయన విరమించలేదు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్​కు రూ. 55 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. దీన్ని హిందుత్వవాదులు వ్యతిరేకించారు.

హేరామ్​ అనలేదు

గాంధీపై గాడ్సే తుపాకితో కాల్పులు జరిపినప్పుడు హేరామ్​ అన్నారని కొందరు అనలేదని కొందరు చెబుతుంటారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. గాంధీని హత్య చేయడానికి నాథూరాం గాడ్సే బృందం ప్రయత్నించింది. ఈ సందర్భంగా గాడ్సే అనుచరుడు మదన్ లాల్ అరెస్టయ్యారు. విషయం తెలుసుకున్న గాంధీ.. మదన్ లాల్​ను  ధైర్యం గల వ్యక్తి అని మెచ్చుకున్నాడట. ‘ఇప్పుడు నేను చెబుతున్నది పిల్లలకు అర్థం కాదు. నేను సరిగానే చెబుతున్నానని నేను పోయాక వీళ్లకు అర్థమవుతుంది’ ప్రచారం. అయితే హత్యాప్రయత్నం విఫలం కావడంతో నేరుగా నాథూరామ్​ గాడ్సే రంగంలోకి దిగారు. 1948 జనవరి 30న ఢిల్లీలోని  బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ “హే రామ్” అన్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన పక్కనే ఉన్న (1944–1948 మధ్య) గాంధీ  ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకట కల్యాణం చెప్పిన  ప్రకారం ‘1948 జనవరి 30న సాయంత్రం 5:17 గంటలకు ఢిల్లీలోని బిర్లాహౌస్‌ ప్రార్థన సమావేశం నుంచి గాంధీ బయటకు వచ్చారు. అదే సమయంలో నాథూరామ్​ గాడ్సే ఎదరుగా వచ్చి తుపాకి గురి పెట్టారు. అయితే ఈ విషయాన్ని గమనించని గాంధీ సహచరి.. గాడ్సేను కూడా పక్కకు జరిపారు. అదే సమయంలో అతి సమీపంలో ఉన్న గాడ్సే (పాయింట్ 380 ఏసీపీ, 606824 ఎం 1934 మోడల్ సెమీ- ఆటోమెటిక్) పిస్టల్‌తో గాంధీని మూడుసార్లు కాల్చారు. ఇందులో ఒక బుల్లెట్​ గాంధీ గుండెను తాకింది. మిగిలిన రెండు కడుపులోకి దూసుకొని పోయాయి. గాంధీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కానీ ‘హేరామ్​’ అనలేదు. గాంధీని కాల్చిన గాడ్సే కూడా పారిపోవడానికి ప్రయత్నించకుండా నేరుగా పోలీసులను పిలిచి మరీ లొంగిపోయారు.’ అని పేర్కొన్నారు.

హే రామ్​ అన్నారు

దీనికి విరుద్ధంగా  గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన నందలాల్ మెహతా మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  హేరామ్​  అంటూ గాంధీ కుప్పకూలి పోయారని వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here