Home breaking news భారత్ లో ముస్లింలు ఫ్రీగా ఉండడం లేదు – డబ్బు చెల్లిస్తున్నాము – ఎంపీ అజం...

భారత్ లో ముస్లింలు ఫ్రీగా ఉండడం లేదు – డబ్బు చెల్లిస్తున్నాము – ఎంపీ అజం ఖాన్

232
0

భారత దేశంలో తాము (ముస్లింలు) ఉచితంగా ఉండడం లేదని .. డబ్బులు చెల్లించి ఉంటున్నామని వివాదాస్పద నేత, ఎంపీ అజం ఖాన్ (సమాజ్ వాదీ పార్టీ) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో నివశించడానికి తాము డబ్బులు చెల్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశ విభజన జరిగిన తర్వాత మా పూర్వీకులు చాలామంది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌కు తరలివెళ్లిపోయారని తెలిపారు. కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారన్నారు. ఇక్కడ ఉన్నందుకూ వారందరికీ ఇక్కడ తగిన శిక్ష పడుతోందని చెప్పారు. దేశంలో నివశించడానికి మేం డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు.

గేదె ను దొంగిలిస్తున్నారని శుక్రవారం బిహార్‌లో జరిగిన మూకదాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీనిపై స్పందించి ఆజం ఖాన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ‍్యలు దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ల్యాండ్‌మాఫీయాలో ఖాన్ ఉన్నారని ఆయన పేరు చేర్చింది. నేరం రుజువైతే ఖాన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆయనపై 30 కేసులు నమోదయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here