Home breaking news బ్రహ్మజ్ఞాని నారా లోకేశం గారికి వేసేయండి వీరతాడు

బ్రహ్మజ్ఞాని నారా లోకేశం గారికి వేసేయండి వీరతాడు

222
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి సేకరణ

–వికాస్​ రుషి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్​ గురించి మాట్లాడుకునే ముందు ‘రాజాధిరాజ.. రాజ మార్తండ.. జయ్​ భవ.. విజయ్​ భవ.’ గురించి తెలుసుకుందాం. ఈ మాటలేంటో.. దీనికి అర్థమేమిటో పాత సినిమాలు చూసిన వారికి.. ఆనాటి రాచరిక వ్యవస్థపై కొంత అవగాహన ఉన్న వారికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. దీని గురించి చెప్పడంలో తప్పులేదుగా.. వంశపారంపర్యంగా పాలకుడిగా వచ్చిన రాజుకు పరిపాలన చేతకాకున్నా.. ధైర్యం లేకున్నా..  విషయ పరిజ్ఞానం లేకున్నా..  ‘మా రాజు.. రాజులదరికంటే గొప్పవాడు. పరాక్రమవంతుడు. అతడికి జయమే.. విజయమే  కలుగుతుంది. ’ అని ఉద్యోగరీత్యా ద్వారపాలకులు. అంటే రాజు రాగానే డోరు తెరిచి ఆహ్వానించేవారు. అట్లనే రాజుతో పనిపడిన  వందిగామదులు ప్రశంసించేవారు. పొగడ్తలు గుప్పించేవారు. తమ అవసరాలు తీర్చుకునే వారు. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఇదే వ్యవహారం సాగుతోంది. పార్టీ అధ్యక్షుల వారి పుత్రరత్నాలను సింహం కడుపున సింహమే పుడుతుందని ఒకరు. ఆహా రాజకీయమంటే.. ఆయన గారి పుత్రుడిదే. చూడండి ఆ రాజసం. ఇలా పొగడ్తల మీద పొగడ్తలు. సరే విషయానికొద్దాం. మొన్నీ మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ ‘మేము ఎన్నార్సీకి వ్యతిరేకమని’ ఒక స్టేట్​మెంట్​ ఇచ్చారు. దీనికి కౌంటర్​గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తన ట్విట్టర్​లో ఒక ట్వీట్​ వేసేశాడు. అదేంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjagan గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారంచేస్తారు. 16 ఆగష్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

అని పేర్కొని వైఎస్​ జగన్​ ఇచ్చిన స్టేట్​మెంట్​ను.. దాని పక్కనే ఒక గెజిట్​ నోటిఫికేషన్​ను పెట్టి ఖర్చు లేకుండా ప్రచారమనిట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.  దానిని చూసిన ఆయన వందిగామదులు.. ఆ పోస్టు ఎంటో చదివారో లేదో గాని ర్వీట్విట్లు చేయడం.. లైక్​లు కొట్టడం చేసేశారు. మన లోక్​శ్​ పేర్కొన్నట్టుగా.. గెజిట్​ నోటిఫికేషన్​.. పదేళ్లకోసారి చేసే జనాభా లెక్కలకు సంబంధించింది మాత్రమే.  ఇదేదో ఎన్నార్సీకి సంబంధించి అని అనుకున్నారో లోకేశ్​ వందిగామదులు ఎవరైన చెప్పారో తెలీదు కానీ ఇదేదో ట్వీటేశాడు. ఇదే నిజమైతే.. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ, ఈనాడు రామోజీ ఊరుకునేవారా లోకేశ్​నాయుడు. అనుమానమొస్తే.. చాటుగా అన్ని తెలుసుకొని పోస్ట్​ చేయొచ్చుగా. దొరికింది కదా అని ఫ్రీగా ట్విట్టర్​ ఉందిగా అని ట్వీటితే ఇలాగే ఉంటుంది. అప్పట్లో ఇలాంటి ట్వీట్లు, మాటలు ఎన్నో అనేశాడు మన లోకేశం. నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు ట్వీటాడు  అందుకే బ్రహ్మజ్ఞాని నారా లోకేశం గారికి వేసేయండి వీరతాడు అని మా తెలుగు టీచర్​ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here