భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ఆర్గనైజేషన్లోని జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న పోస్టులు 337.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు
డ్రాఫ్ట్స్మెన్-40 హిందీ టైపిస్ట్- 22, స్టోర్స్ సూపర్వైజర్- 37, రేడియో మెకానిక్- 2, లేబరేటరీ అసిస్టెంట్- 1, వెల్డర్స్- 15, మల్టీ స్కిల్డ్ వర్కర్స్(మేసన్)- 215, మల్టీ స్కిల్డ్ వర్కర్స్(మెస్ వెయిటర్స్)- 5
అర్హతలు: పదోతరగతి, దరఖాస్తు చేసుకున్న విభాగంలో సర్టిఫికెట్/అనుభవం. హేవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులకు మాత్రమే అవకాశం.
వయసు: కుక్ పోస్టుకు 18-25 మధ్య, మిగిలిన పోస్టులకు 18-27 మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక: రాత పరిక్ష, ఫిఇకల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనరల్ కేటగిరి వారికి రూ. 50 రుసుము చెల్లించాలి.
దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరితేదీ
వివరాలకు : బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్స్