Home breaking news బొజ్జ గణపయ్య మీద బాలివుడ్ యాక్టర్లకు ఎంత భక్తో..! చూడండి

బొజ్జ గణపయ్య మీద బాలివుడ్ యాక్టర్లకు ఎంత భక్తో..! చూడండి

303
0
ఫొటో: ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ ట్విట్టర్​లోని వీడియో నుంచి

వినాయక చవితి పండుగ ఇప్పుడు ఫేమస్​. స్వాతంత్రోద్యమ కాలంలో అందరూ కలుసుకోవడానికి ఈ పండుగ ప్రారంభిస్తే.. ఇప్పుడు ఎవరికి వారు తమ సత్తా చాటుకోవాలని ఈ పండుగను ‘ఘనంగా’ నిర్వహిస్తున్నారు. అందుకే నోట్ల గణపతి కూడా తయారవుతున్నారు. ఎంత చెట్టుకు అంతేగాలి అన్నట్టుగా డబ్బున్నోడి గణపతి.. డబ్బు గణపతి. పేదోడి గణపతి.. పేద గణపతి. సరే ఇదంతా ఎప్పటికీ నడిచేదే. ముంబాయిలో ఇంటర్నేషనల్​ వ్యాపారవేత్త అంబానీ కూడా గణపతి పండుగ సందర్భంగా ఉత్సవం నిర్వహించారు.

ఈ ఉత్సవానికి అమితాబచ్చన్​, అభిషేక్​ బచ్చన్​, రణబీర్​కపూర్​, అలియాభట్​ ఇలా హిందీ సినిమా యాక్టర్లందరూ తరలివచ్చారు. వారందరికీ అంబానీ.. తనదైన శైలిలో గణపతి విగ్రహాలు అందించారు. తీసుకున్న వారందరూ గణపతి విగ్రహాలను ‘భక్తి’తోనే కాళ్లకు చెప్పులు, బూట్లు వేసుకొని మరీ తీసుకున్నారు. చూడండి వీరందరికీ ఎంత భక్తో. గణపతి కన్పించగానే.. కాళ్లకు చెప్పులున్నాయన్న సంగతి మర్చి మరీ భక్తి పారవశ్యంతో విగ్రహాలను తీసేసుకున్నారు. ఇది చూస్తున్న వారు ఊరుకుంటారా..? ఇది మరీ సోషల్​ మీడియా యుగమైపాయే. దీన్ని ఎవరో తీశారో ఏమో కానీ ప్రముఖ ఇంగ్లిష్​ దినపత్రిక ‘ఇండియన్​ ఎక్స్​ప్రెస్​’ తన వెబ్​సైట్లో పోస్ట్​ చేసింది. ఈ పోస్ట్​ను రీ ట్వీట్​ల మీద రీ ట్వీట్​లు.. లైక్​ల మీద లైక్​లు. కామెంట్ల మీద కామెంట్లు. మీరూ చూడండి. ఈ వీడియోను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here