Home breaking news బెంగాల్‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై విరుచుక‌ప‌డిన లాఠీ- కోల్‌క‌తాలో ఉద్రిక్త‌త‌

బెంగాల్‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై విరుచుక‌ప‌డిన లాఠీ- కోల్‌క‌తాలో ఉద్రిక్త‌త‌

118
0

ప‌శ్చిమ‌బెంగాల్లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ‌ నెల‌కొంది. బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు, రాజకీయ హ‌త్య‌ల‌తో బెంగాల్ అట్టుడుకుతోంది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌ల‌ను నిర‌సిస్తూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు కోల్‌క‌తాలో భారీ నిర‌స‌న చేప‌ట్టింది. ఈ నిర‌స‌న‌కు బీజేకీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. దీంతో కోల్‌క‌తాలో ఏం జరుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. నిర‌స‌న తెల‌ప‌డానికి వ‌చ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు వెళ్ల‌నీయ‌కుండా నిరోధించ‌డంలో భాగంగా పోలీసులు బారీకేడ్ల‌ను ఏర్పాటు చేశారు. వాటిని దాటి వెళ్ల‌డానికి బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నించ‌డంతో.. పోలీసులు భాష్ప‌వాయిగోళాల‌ల‌ను ప్ర‌యోగించారు. అయినా కార్య‌క‌ర్త‌లు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో.. పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌ని చెప్పారు. దొరికిన వారిని దొరికిన‌ట్టుగా చిత‌క‌బాదారు. తృణ‌మూల్ కాంగ్రెస్ దాడులు.. పోలీసుల వైఖ‌రికి నిర‌స‌నగా బీజేపీ నేత‌లు కేలాష్ విజ‌య‌వ‌ర్గీయ‌, లాకెట్ ఛ‌ట‌ర్జీ స‌హా ముఖ్య‌నేత‌లు కోల్‌క‌తా పోలీస్ ప్ర‌ధాన కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here