Home తాజా వార్తలు బీజేపీకో సొంత ప‌త్రిక‌

బీజేపీకో సొంత ప‌త్రిక‌

279
0
  • వికాస్ రుషి

ఇప్పుడు ఎవరో వచ్చి డబ్బా కొట్టాలంటే నడవడం లేదు. ఎవరి డబ్బా వారు కొట్టు కోవాల్సిందే. ఎవరి ప్రచారం వారు చేసుకోవాల్సిందే. రాజుల కాలంలో అయితే.. రాజు పక్కన ఉండే కొంతమంది రాజును పొగిడేవారు. వీరుడు.. శూరుడు అని డబ్బా కొట్టేవాళ్లు. రాజు సమావేశానికి వస్తున్న సమయంలో ద్వార పాలకులు *రాజాధిరాజా.. రాజమార్తాండ* అంటూ సందేశం ఇచ్చేవారు. రాజుకు సంబంధించిన కొందరు తమ యధాశక్తి రాజ్యంలో రాజు గురించి డబ్బా కొట్టేవాళ్లు. కాలం మారింది కొంత మంది తమ కోసం దిన పత్రికలు, వార పత్రికలు ప్రారంభించుకొని నడిపించుకుంటున్నారు. అప్పట్లో నిజాయతీగా నడిచే పత్రికలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు భూతద్దంలో వెతకాల్సిందే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. బీజేపీ వాళ్లు సొంతంగా ఒక దిన పత్రిక పెట్టాలన్న ఆలోచనకు వచ్చారంటా. ఇప్పటి వరకు అన్ని పత్రికలు మన పత్రికలు అన్న భావనలో ఉన్న బీజేపీ.. అన్నికాదు.. కొన్ని పత్రికలు కూడా మన గురించి రాస్త లేవని ఆలస్యంగా గుర్తించారు. అందుకే పత్రిక పెట్టాలని నిర్ణయించారంట. ఏం పేరు పెడతారో తెలియదు కాని.. పార్టీ సమాచారాన్ని కార్యకర్తలకు చేరవేయడానికి *జనసందేశ్ టైటిల్ తో వార పత్రిక, ఉదయ కమలం పేరుతో మాస పత్రిక* ప్రింట్ చేస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేదా కొత్త టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో తాను ఎంత రాసినా బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు లేవలేదని, రోజూ కేసీఆర్ ను మోయడం తన వల్ల కాదని *సీ ఏల్ రాజం తన పత్రిక విజయక్రాంతి* ని కరెక్టుగా ఏడాదికే మూసేసుకున్నారు.

దేశమంతా కాదుగాని తెలుగు రాష్ట్రాల విషయానికోస్తే టీఆర్ ఎస్ కు *నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, Telangana today, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ* ఇంకా బోలెడు పత్రికలున్నాయి.  ఈ. మధ్యే అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆంధ్రజ్యోతి దూరమైంది. తన బాస్ చంద్రబాబు చక్రం తిప్పుతాడని అనుకొని మహా కూటమికి అనుకూలంగా వార్తలు రాసేసింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు చక్రం కాదు కదా బొంగరాలు కూడా తిప్పలేడని ఫలితాలు తేల్చాయి. ఆంద్రప్రదేశ్ లో టిడిపికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు సాక్షి ఉంది. క‌మ్యూనిస్టుల‌కైతే ప్రజాశ‌క్తి, న‌వ తెలంగాణ‌, విశాలాంధ్ర‌, ప్ర‌జాప‌క్షం ప‌త్రిక‌లున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పత్రిక పెట్టుకుంటే. కాంగ్రెస్ కే సొంత పత్రిక ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here