Home breaking news బిగ్‌బాస్‌-3 షోపై వివాదం హైకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ‌

బిగ్‌బాస్‌-3 షోపై వివాదం హైకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ‌

182
0
న‌టుడు నాగార్జున‌

ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున నేతృత్వంలో జ‌రిగే బిగ్‌బాస్‌-3 షోపై రోజు రోజుకు వివాదం పెరిగిపోతోంది. ఇప్ప‌టికే యాంక‌ర్ శ్వేతారెడ్డి, న‌టి గాయత్రి గుప్తా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కూడా హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. బిగ్‌బాస్-3 షోను సెన్సార్ చేసి ప్రసారం చేయించాల‌ని ఆయ‌న పిటీష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటీష‌న్‌పై వ‌చ్చే మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు రానుంది. ఈ షో వివాదంలో నటుడు నాగార్జున‌తో పాటు మ‌రో ప‌దిమందిని ప్ర‌తివాదులుగా చేర్చారు.

బిగ్‌బాస్‌-3 షోకు ఎంపిక చేశామ‌ని చెప్పి,. మోసం చేశార‌ని యాంక‌ర్ శ్వేతారెడ్డి, న‌టి గాయత్రి గుప్తా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదంపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ స్పందించారు. అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన నాగార్జున ఈ షోలో పాల్గొంటున్నారు. అటువంటి షోపై వివాదం త‌గ‌దు. వివాదాలు ఉంటే నాగార్జున వంటి స్టార్ న‌టుడు ఈ షోకు రారు క‌దా..? అంటూ పేర్కొన్నారు. ఈ షోలో ఎలాంటి ఇబ్బంది క‌లిగించే అంశాలున్నా.. నేనే నిల‌దీస్తాన‌ని ఆమె చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here