Home breaking news బావ హరీష్ చేతిలో కేటీఆర్ ఓటమి

బావ హరీష్ చేతిలో కేటీఆర్ ఓటమి

131
0

హైదరాబాద్; బావ హరీష్ రావు చేతిలో బామ్మర్థి కేటీఆర్ చిత్తుగా ఓడిపోయారు. హరీష్ కంటే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకుంటానని ప్రకటించిన కేటీఆర్ వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. విషయానికొస్తే.  లోక్ సభ ఎన్నికల్లో మెదక్ స్థానానికి హరీష్ రావు ఇన్ ఛార్జ్ గా వ్యవహరించగా.. కరీంనగర్ స్థానానికి కేటీఆర్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో హరీష్, కేటీఆర్ మధ్య సరదాగా సంవాదం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెదక్ కంటే ఒక్క ఓటు ఎక్కువ సాధించి కరీంనగర్ స్థానంలోనూ గెలుస్తామని సరదా సవాల్ విసిరారు. సీన్ కట్చేస్తే.. మెదక్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ని హరీష్ రావు.. 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ 85 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ లెక్కన బావ హరీష్ చేతిలో బామ్మర్థి కేటీఆర్ ఒడిపోయునట్టేగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here