Home breaking news ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల వేడి – బీజేపీలో సినీ, రాజకీయ ప్ర‌ముఖుల చేరిక‌

ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల వేడి – బీజేపీలో సినీ, రాజకీయ ప్ర‌ముఖుల చేరిక‌

160
0
ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల వేడి - బీజేపీలో సినీ, రాజకీయ ప్ర‌ముఖుల చేరిక‌
బీజేపీలో చేరుతున్న‌ సినీ, రాజకీయ ప్ర‌ముఖులు

ప‌శ్చిమ‌బెంగాల్లో రెండేళ్ల ముందుగానే.. ఎన్నిక‌ల వేడి పుంజుకున్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపి.. 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ చూపిన స‌త్తా చూసిన తృణ‌మూల్ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, సీపీఎం నేత‌లు అనేక‌మంది చేరారు. సొంత శ‌క్తితో పాటు.. వ‌చ్చిన అద‌న‌పు బలంతో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు బీజేపీ చెమ‌ట‌లు ప‌ట్టించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇప్ప‌టి నుంచి బీజేపీ త‌న ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తోంది. అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి ప్ర‌ముఖుల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా బెంగాల్‌కు చెందిన‌ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు 13 మంది చేరారు.

బీజేపీలో చేరుతున్న సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు (వీడియోః బీజేపీ ఫేస్‌బుక్)

ఈ సంద‌ర్భంగా బెంగాల్ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్ మాట్లాడారు. ప్ర‌ముఖ నటులు రిషి కౌశిక్‌, పార్నో మిత్రా, కాంచన మెయిత్రా, రూపా భట్టాచార్య అంజనా బసు, కౌశిక్‌ చక్రవర్తి వంటి పలువురు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఉద్రిక్త‌లు సృష్టిస్తున్న ఈ తరుణంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు వెరవక బీజేపీలో చేరిన నటీమణులకు శిరసు వహించి వందనం స‌మ‌ర్పిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. తాము పెంచుకుంటున్న రాజ‌కీయ బ‌లానికి తోడు న‌టుల ఛ‌రిస్మా తోడైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సులువుగా ల‌భిస్తుంద‌న్న అంఛ‌నాతో ఈ విధంగా చేరిక‌ల‌కు శ్రీకారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా 2014 లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌ను గుర్తుకు తెచ్చుకుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేయ‌డం, మ‌రో ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగార్జున.. మోదీతో భేటీ కావ‌డం వంటి సంఘ‌ట‌న‌లున్నాయి. 2019 ఎన్నిక‌ల్లోనూ సినీ న‌టులు, క్రీడాకారులకు టికెట్లు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌చారంలో విరివిగా బీజేపీ వాడుకుంది. అదే విధంగా ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రెండేళ్ల ముందుగానే.. న‌టుల‌ను రాజ‌కీయ తెరపైకి ప్ర‌వేశ‌పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here