Home సినిమా `ప్లానింగ్` ఆడియో ఆవిష్క‌రణ | telugu film

`ప్లానింగ్` ఆడియో ఆవిష్క‌రణ | telugu film

142
0

మ‌హేంద్ర‌- మ‌మ‌త కుల‌క‌ర్ణి ల‌ను నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌యం చేస్తూ బి.ఎల్.ప్ర‌సాద్ (ప‌రిచ‌యం) ద‌ర్శ‌క‌త్వంలో సాయి గ‌ణేష్ మూవీస్ ప‌తాకంపై టి.వి.రంగ‌సాయి నిర్మించిన సినిమా ప్లానింగ్. అలీషా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. ఉద‌య్ కిర‌ణ్ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌ సి.క‌ళ్యాణ్ ఆడియో సీడీల్ని ఆవిష్క‌రించారు. రామ స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్‌, దర్శ‌కుడు భాను కిర‌ణ్, సంజ‌య్ త‌దిత‌రులు పాట‌ల్ని ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ పాల్గొంది. హీరో మ‌హేంద్ర మాట్లాడుతూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో చ‌క్క‌ని ప్లానింగ్ తో ఈ సినిమా చేశార‌ని చెప్పారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌థానాయిక మ‌మ‌తా కుల‌క‌ర్ణి మాట్లాడుతూ..ద‌క్షిణ భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు చేశాన‌ని చెప్పారు. ఐటెమ్ గీతంతో కెరీర్ ప్రారంభించి తాను క‌థానాయిక‌గా మారాన‌ని చెప్పారు. ముఖ్య అతిధి సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ- ఆడియో బావుంద‌ని విజువ‌ల్స్ బాగా వ‌చ్చాయని చెప్పారు. చిన్న సినిమా అయినా చ‌క్క‌ని ప్లానింగ్ తో రంగ‌సాయి శెట్టి- ప్ర‌సాద్ ఈ చిత్రానికి ప‌ని చేశారని తెలిపారు. విభిన్న‌మైన ప్ర‌య‌త్న‌మే ఇది. యువ‌త‌రం హీరో మ‌హేంద్ర చ‌క్క‌గా న‌టించార‌ని అభినందించారు.
సాయి వెంక‌ట్ మాట్లాడుతూ- కొరియోగ్రాఫ‌ర్ హీరో కావ‌డం వ‌ల్ల న‌టుడిగా తొణికిస‌లాడ‌కుండా చేశాడ‌ని తెలిపారు. నిర్మాత రంగ సాయి మాట్లాడుతూ- క‌ళ్యాణ్ త‌న‌కు వెన్నుద‌న్నుగా నిలిచార‌ని తెలిపారు. మ‌హేంద్ర‌, అలీషా ఎంతో స‌హ‌క‌రించార‌ని చెప్పారు. సంగీత దర్శ‌కుడు ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ నేను మైన‌ర్ నే అయినా మేజ‌ర్ అని నిరూపించుకునేలా చ‌క్క‌ని సంగీతం అందించాన‌ని చెప్పారు. రంగ‌సాయి, ఉరుకుంద‌ప్ప‌, అస్మిత‌, ఆదిత్య చైత‌న్య‌, సంతోష్‌, సుప్రీం సాయి, తిరుమ‌ల‌రావు, విజ‌య్ కుమార్, శంక‌ర్, బార్బీ, అనూష‌, ప‌వ‌న్ కుమార్, ల‌క్ష్మి, ధ‌న‌ల‌క్ష్మి, ప్రిన్స్ వేణు, రాజేష్, విన‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. స‌హ‌నిర్మాత‌లు: బి.ధ‌నుంజ‌య్, బి.దేవి, ఎడిట‌ర్: నాగు, కొరియోగ్ర‌ఫీ: బ‌షీర్, ఫైట్స్: వాసు, నిర్వ‌హ‌ణ‌: బి.భూల‌క్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here