Home breaking news ప్ర‌ధాని రేసులో లేను- కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

ప్ర‌ధాని రేసులో లేను- కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

84
0

ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి రేసులో లేనని కేంద్ర ర‌వాణ శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స్ప‌ష్టం చేశారు. తాను జాతీ సేవ‌కు అంకిత‌మైన ఆర్ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌న‌ని స్ప‌ష్టం చేశారు. కొంత కాలంగా నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌ధాని రేసులో ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్ డీ ఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ప్ర‌చారాన్ని తెలుగు మీడియా మ‌రింత ఉధృతంగా చేస్తోంది. వామ‌ప‌క్ష భావ‌జాల‌మున్న ప‌త్రిక‌లు కూడా ఈ విష‌యాన్ని ప్రాచుర్యం చేస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన గడ్కరీ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధానిగా మ‌ళ్లీ మోదీ అవుతార‌ని ప్ర‌కటించినా.. మీడియా ప్ర‌చురించ‌లేదు. కాగా.. శుక్ర‌వారం (మార్చి 1) ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తాను ప్ర‌ధాని రేసులో లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 13 నెల‌ల్లో గంగా న‌దిని ప్రక్షాళ‌న చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here