Home breaking news ప్ర‌ధాని మోదీ అధ్యక్ష‌త‌న ఆరు కేబినెట్ క‌మిటీల ఏర్పాటు

ప్ర‌ధాని మోదీ అధ్యక్ష‌త‌న ఆరు కేబినెట్ క‌మిటీల ఏర్పాటు

276
0

న్యూ ఢిల్లీః ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోదీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త‌గా విదేశీ పెట్టుబ‌డులు, యువ‌త‌కు ఉద్యోగావ‌క‌శాల కోసం రెండు కేబినెట్ క‌మిటీలు ఏర్పాటు చేయ‌డం స‌హా మ‌రో ఆరు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది క‌మిటీల్లో మోదీ ఆరు క‌మిటీల‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. విదేశీపెటుబడులు, అభివృద్ధి కేబినెట్‌ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, పీయూష్‌గోయల్‌ను సభ్యులుగా నియమించారు. ఉద్యోగకల్పన–నైపుణ్యాభివృద్ధి కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, సీతారామన్, పీయూష్‌ గోయల్, నరేంద్రసింగ్‌ తోమర్, రమేశ్‌ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్‌ పాండే, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్, హర్దీప్‌ పురీ సభ్యులుగా నియ‌మించారు.

కేబినెట్ క‌మిటీ, స‌భ్యుల‌ వివ‌రాలు

క్యాబినెట్ నియామకాల కమిటీః ప్రధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా

అకామిడేష‌న్‌ కేబినెట్ కమిటీః అమిత్ షా, నితిన్ జైరాం గడ్కరీ, నిర్మల సీతారామన్, పీయుష్ గోయల్, ప్రత్యేక ఆహ్వానితులుః జితేంద్ర సింగ్, హర్దీప్ సింగ్ పూరి

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీః న‌రేంద్ర‌మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్ షా, నితిన్ జైరాం గడ్కరీప స‌దానంద‌గౌడ‌, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమార్, రవి శంకర్ ప్రసాద్, హర్సిమ్రాత్ కౌర్ బాదల్, డాక్ట‌ర్‌ సుబ్రహ్మణ్యం జయశంకర్, పీయుష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీః అమిత్ షా, నిర్మల సీతారామన్, రామ్‌విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమార్, రవి శంకర్ ప్రసాద్, థావర్ చంద్ గెహ్లాట్, ప్రకాష్ జవదేకర్, ప్రహ్లాద్ జోషి, ప్రత్యేక ఆహ్వానితులుః అర్జున్ రామ్ మేఘవ్వాల్, వి మురళీధరన్,

రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీః న‌రేంద్ర‌మోదీ, అమిత్ షా, నితిన్ జైరాం గడ్కరీ, నిర్మల సీతారామన్, రామ్‌విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమార్, రవి శంకర్ ప్రసాద్, హర్సిమ్రాత్ కౌర్ బాదల్, డాక్టర్ హర్ష్ వర్ధన్, పీయుష్ గోయల్, అరవిన్ గణపత్ సావంత్, ప్రహ్లాద్ జోషి

భద్రతా వ్య‌వహారాల‌ కేబినెట్ కమిటీః న‌రేంద్ర‌మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్ షా, నిర్మల సీతారామన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్.

విదేశీ పెట్టుబ‌డులు, అభివృద్ధి కేబినెట్ క‌మిటీః న‌రేంద్ర‌మోదీ, అమిత్ షా, నితిన్ జైరాం గడ్కరీ, నిర్మల సీతారామన్, పీయుష్ గోయల్

ఉపాధి మరియు నైపుణ్యం అభివృద్ధి కేబినెట్ కమిటీః న‌రేంద్ర‌మోదీ, అమిత్ షా, నిర్మల సీతారామన్, నరేంద్ర సింగ్ తోమార్, పీయూష్‌గోయ‌ల్‌, రమేశ్‌ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్‌ పాండే, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్, హర్దీప్‌ పురీ, ప్రత్యేక ఆహ్వానితులుః నితిన్ జైరాం గడ్కరీ, హర్సిమ్రాత్ కౌర్ బాదల్, స్మృతి జుబిన్ ఇరానీ, ప్రహ్లాద్ సింగ్ పటేల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here