Home జాతీయం ప్ర‌ధాని మోదీకి గొడుగు ప‌ట్టిన కిర్గిస్థాన్‌.. శ్రీలంక‌

ప్ర‌ధాని మోదీకి గొడుగు ప‌ట్టిన కిర్గిస్థాన్‌.. శ్రీలంక‌

120
0
ప్ర‌ధాని మోదీకి గొడుగు ప‌ట్టిన కిర్గిస్థాన్ అధ్య‌క్షుడు సూరంబే జింబ‌కోవ్

ప్ర‌ధానమంత్రి నరేంద్ర‌మోదీ.. వారం రోజుల తేడాతో రెండు దేశాల్లో ప‌ర్య‌ట‌న‌లు. వినూత్న రీతిలో గౌర‌వ మ‌ర్యాద‌లు. ఇవి మోదీకి వ్యక్తిగా కాదు.. భార‌త్‌కు ల‌భించిన గౌర‌వ‌మ‌నే చెప్పుకోవాలి. వారంరోజుల తేడాతో ప్ర‌ధాని మోదీ.. శ్రీలంక‌, కిర్గిస్థాన్లో ప‌ర్య‌టించారు. శ్రీలంక‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి బాధితుల‌కు సంఘీభావం తెలుప‌డానికి గ‌త వారంలో మోదీ.. అక్క‌డి వెళ్లారు. ఉగ్ర‌దాడిలో మృతి చెందిన శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన త‌రువాత వ‌స్తున్న మోదీకి చిరువ‌ర్షం స్వాగ‌తం ప‌లికింది. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న శ్రీలంక అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన.. మోదీ త‌డ‌వ‌కుండా స్వ‌యంగా గొడుగు ప‌ట్టారు. ఆయ‌న ఆదేశిస్తే.. ఏ భ‌ద్ర‌తా సిబ్బందో వ‌చ్చి గొడుగు ప‌ట్టేవారు.

కానీ సిరిసేన స్వ‌యంగా గొడుగు ప‌ట్టారు. తాజాగా కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో జ‌రుగుతున్న షాంఘై కో ఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌సీవో) స‌మావేశాల‌కు వెళ్లారు మోదీ. ప‌నిలో ప‌నిగా ర‌ష్యా, చైనా అధ్య‌క్షులు.. పుతిన్‌, జిన్‌పింగ్‌తో వేర్వేరుగా మాట్లాడారు. అక్క‌డ కూడా శ్రీలంక‌లో జ‌రిగిందే రిపీట్‌. ప్ర‌ధాని మోదీ వేదిక మీద‌కు వెళ్తున్న స‌మ‌యంలో.. చిరువ‌ర్షం మొద‌లైంది. ప‌క్క‌నే ఉన్న కిర్గిస్థాన్ అధ్య‌క్షుడు సూరంబే జింబ‌కోవ్ వెంట‌నే గొడుగు ప‌ట్టారు. పైని చిత్రంలో చూడండి. అనేక మంది ఉన్నారు చుట్టూ. దేశాధ్య‌క్షుడు ఆదేశిస్తే ప‌రిగెత్తుకొస్తారు. గొడుగు ప‌డ్తారు. కానీ సూరంబే జింబ‌కోవ్ స్వ‌యంగా గొడుగు ప‌ట్టారు మోదీ త‌డ‌వ‌కుండా. రెండు దేశాల అధ్య‌క్షులు మోదీకి గొడుగులు ప‌ట్ట‌డం.. ఆయ‌నంటే ఇష్టం లేని వాళ్లు ఇబ్బంది ప‌డుతుండొచ్చు. కానీ అది మ‌న దేశానికి ద‌క్కిన గౌర‌వం. ఇటువంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో జరిగాయో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం జ‌రిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here