Home జాతీయం ప్ర‌జ‌లు అమాయ‌కులు కారు.. తెలిసో.. తెలియ‌కో నిజమే మాట్లాడిన చంద్ర‌బాబు

ప్ర‌జ‌లు అమాయ‌కులు కారు.. తెలిసో.. తెలియ‌కో నిజమే మాట్లాడిన చంద్ర‌బాబు

179
0
గుంటూరులో పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతున్న చంద్ర‌బాబు

ఒక్కోసారి అనుకోకుండా నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. నిజంగా తాము నిజ‌మే మాట్లాడామ‌ని మాట్లాడిన వ్య‌క్తికి కూడా తెలిసి ఉండ‌క పోవ‌చ్చు. ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా అదే విధంగా ఒక నిజ‌మైతే మాట్లాడారు. వైసీపీ నేత‌లు ఏది చెబితే అది న‌మ్మ‌డానికి ప్ర‌జలు అమాయ‌కులు కారు అని వ్యాఖ్యానించారు. హెడ్డింగ్ అదే పెడితే బాగోదు అనుకున్నారేమో.. ? అనుకూల మీడియా.. న‌న్ను వెంటాడ‌మే ప‌నిగా అని పెట్టేశారులే. విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన అనంత‌రం చంద్ర‌బాబు దేశ ప‌ర్య‌ట‌న‌లో సారీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో బిజీగా మునిగిపోయారు. పార్టీ కేడ‌ర్‌ను క‌ల‌వ‌డం, వారి నుంచి విష‌యాలు తెలుసుకోవ‌డం.. మీ మీద దాడులు జ‌రుగుతున్నాయి. మీకు నేను అండ‌గా నిల‌బ‌డుతా అంటూ హామీ ఇవ్వ‌డం జ‌రిగిపోతూ ఉంది. పార్టీ ఓట‌మికి నేత‌లే కార‌ణ‌మంటూ కేడ‌ర్‌ అసలు నిజాలు చెప్ప‌బోతే.. ఇప్పుడ‌వ‌న్నీ ఎందుక‌ని చంద్ర‌బాబే మాట దాటేస్తున్నారులే.

స‌రే ఇవ‌న్నీ కాదు కానీ నిన్న ఒంగోలు, గుంటూరు ప‌ర్య‌ట‌న ముగించుకున్న‌ బాబు.. మీడియాతో మాట్లాడుతూ నా గురించి వైసీపీ నేత‌లు ఏదేదో చెబుతున్నారు. వారు ఏది చెబితే అది న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు అమాయ‌కులు కారు అని ఠ‌క్కున నిజం మాట్లాడేశారు. నిజ‌మే ప్ర‌జ‌లు అమాయ‌కులు కాదు కాబ‌ట్టే.. మొన్న‌టి ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు చెప్పిన వాటిలో నిజాలు గుర్తించి వైసీపీకి ఓటేసీ గెలిపించారు. ఎన్నెన్ని అబద్ధాలు.. ఏపీకి ప్ర‌త్యేకహోదా అవ‌సరం లేద‌న్న బాబు.. ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని హోదాపై పోరాటం. ప్ర‌జ‌లు అమాయ‌కులా..? హోదా సంజీవిని కాదు, మాట్లాడితే అరెస్ట్ చేస్తా అంటూ హూంకరించిన బాబు మాట‌లు మ‌రిచిపోతారా..? న‌రేంద్ర‌మోదీని పొగిడి పొగిడి.. నాలుగో ఏట తిడితే ప్ర‌జ‌లకు తెలియ‌దా..? ఎందుకు తిట్టారో..? రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోతోంది ఇక ప్ర‌పంచంలో నెంబ‌ర్‌వ‌న్‌ రాజ‌ధాని, పోల‌వరం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మాట‌లు ప‌త్రికల మొద‌టి పేజీలో హెడ్డింగ్‌లు. ప‌త్రిక‌లు ఎంత మోసినా..? వీటిలో ఏవి నిజ‌మో..? ఏది అబ‌ద్ధ‌మో..? తెలుసుకోలేనంత అమాయ‌కులు కారు ఏపీ ప్ర‌జ‌లు. అందుకే తీర్పు మార్చారు.

అధికారంలోకి వ‌చ్చిన నెల రోజ‌ల్లోనే వైసీపీ పాల‌న తేలిపోయింద‌ని.. క‌రెంట్ కోత‌లు.. విత్త‌నాల కొర‌త‌, సాగునీటి కొర‌త‌, క‌రువు నెల‌కొంద‌ని కూడా చంద్ర‌బాబు ప్ర‌వచించారు. బాబు మాట‌ల్లోనే తేలిపోయిన అంశ‌మేమిటంటే ఈ కొర‌త‌ల‌కు కార‌ణం వైసీపీ కాద‌ని. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నెల రోజులే.. ఇంకా గ‌వ‌ర్న‌మెంట్ స‌రిగ్గా కుదురుకోనేలేదు. అప్పుడే వాళ్లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఆల‌స్యం చేయ‌డం.. ఆ కార‌ణంగానే ఇవ‌న్ని ఏర్ప‌డ్డాయా..? లేకుంటే ఐదేళ్ల‌ బాబుగోరు పాల‌న‌లో తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఏర్ప‌డ్డాయా..? ఆ మాత్రం ప్ర‌జ‌లు తెలుసుకోరా..? బాబుగోరు మీరు చెప్పిన‌ట్టుగా ప‌్ర‌జ‌లు అమాయ‌కులు కారు.. చెప్పిన‌వ‌న్నీ న‌మ్మ‌డానికి.

ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here