Home breaking news దిశపై ‘హత్యాచారం’ చేసిన వారిని ఉరితీస్తే సరిపోతుందా..?

దిశపై ‘హత్యాచారం’ చేసిన వారిని ఉరితీస్తే సరిపోతుందా..?

219
0

– వికాస్​ రుషి

‘దిశ’పై ‘హత్యాచారం’ చేసి ఆపై కాల్చివేసిన సంఘటన ఇప్పుడు దేశంలో సంఛలనం. ఇటువంటివి జరిగినప్పుడు వచ్చే డిమాండే ఇప్పుడూ వచ్చింది. ప్రియాంకరెడ్డిపై ‘హత్యాచారం’ చేసిన వారిని ఉరి తీయాలి. లేకుంటే ఎన్​కౌంటర్​ చేసి చంపేయాలి. ఈ రెండు డిమాండ్లు అందరూ చేస్తున్నారు. వీరిని చంపేస్తే సరిపోతుందా..? సమస్య పరిష్కారమవుతుందా..? ఇక నుంచి ఇటువంటి ఘటనలు జరగవా..? డిమాండ్​ చేస్తున్న వారు.. ఈ డిమాండ్లను లైవ్​లో చూపిస్తున్న మీడియా.. ఈ గ్యారంటీ ఇస్తుందా..? 11 ఏళ్ల క్రితం వరంగల్​లో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్​ దాడి జరిగింది. ఇందులో ఒకరు చనిపోయారు. ఈ దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పారిపోతుంటే.. ఎన్​కౌంటర్​ చేశారు. ఇది నిజమైనదా..? కాదా..? అన్నది అప్రస్తుతం. కానీ ఈ  ఎన్​కౌంటర్​ జరిగింది ప్రస్తుత సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ వరంగల్​ ఎస్పీగా ఉన్న సమయంలోనే. ఈ ఎన్​కౌంటర్​ తర్వాత మహిళలపై దాడులు ఆగలేదు. హత్యాచారాలు, అత్యాచారాలు ఆగలేదు. ఈ ఏడాదిలోనే యాదాద్రి జిల్లాలో ముగ్గురు అమ్మాయిలను ట్రాప్​ చేసి హత్యాచారం చేసిన ఘటన. ఈ మధ్యలోనే వరంగల్​లో ఒక చిన్నారిపై లైంగికదాడి. అంతెందుకు దిశపై హత్యాచారం ఘటన తర్వాతి రోజే మరో మహిళ శవం కాలిపోతూ కన్పించింది. అలా అని దోషులను శిక్షించవద్దని కాదు ఈ వ్యాసం ఉద్దేశం. ఉరి తీయడం, ఎన్​కౌంటర్లు చేయడం వల్ల ఇవి ఆగిపోవని చెప్పడానికే వరంగల్​ ఎన్​కౌంటర్​ను ఉదహారణగా పేర్కొన్నాను.

వరంగల్​ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన యాసిడ్​ నిందితులు(గూగుల్​ నుంచి)

హత్యాచారాలు, అత్యాచారాలు, ప్రేమ దాడులు జరగడానికి ఎవరు కారణం. ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. మేము కాదంటే మేము కాదని చెప్పుకోవడం కూడా సరికాదు. ఇవి జరగడానికి పరోక్షంగా అందరూ కారణమే. ముందు పోలీసులు కాదు పాలకులే కారణం. వారిని ఎన్నుకున్న మనమూ కారణమే. పిల్లలు అడగగానే.. స్మార్ట్​ ఫోన్​ కొనిచ్చే తల్లితండ్రులు, వాటిని కావాలని పట్టుబట్టే.. పిల్లలు కారణమే. ఏ సంఘటన జరిగినా.. ఇష్టమొచ్చినట్టు చూపించే  మీడియా కారణమే. భావస్వేచ్ఛ పేరుతో ఇష్టమొచ్చినట్టు సినిమాల్లో సీన్లు. వాటిని ‘ఎంజాయ్​’ చేసే మనం. నోటికొచ్చినట్టు మాట్లాడే సెలబ్రేట్లు. సంపాదన పేరుతో.. పిల్లలను గాలికొదలడం, వాళ్లేం చేస్తున్నారో కూడా గమనించేంత తీరిక లేకపోవడం. మీ పిల్లలు ఇలా అని పక్కింటోడు చెబితే.. ఇంకా పాతకాలం మనుషులుగా ఉండడమేమిటీ..? ఇప్పుడు మనం ఆధునికంగా ఉండాలంటూ పాఠాలు చెప్పడం. మనలను మనం మోసం చేసుకుంటూ ఎదుటివాళ్లను మోసం చేస్తూ బతికేస్తున్నాం.

ఇప్పుడు చేయాల్సింది ఉరి శిక్షలు కాదు.. ఎన్​కౌంటర్లు అంతకంటే కాదు. ఎందుకిలా..? ఇలా జరగడానికి ప్రేరేపించేవి ఏమిటీ..? ఇంటర్​నెట్​లో విచ్చలవివిగా ఫోర్న్​ వీడియోలు, స్మార్ట్​ ఫోన్​లో అప్రయత్నంగానే వచ్చే సీన్లు. సినిమాల్లో అనుచిత సీన్లు. నోటికొచ్చినట్టు మాట్లాడే సెలబ్రేట్లు. టీవీల్లో వచ్చే కల్పిత కథనాలు ఇటువంటివి మనిషినికంట్రోల్​ తప్పిస్తున్నాయి. ముందు వీటిని కంట్రోల్​ చేయండి. భావస్వేచ్ఛ పేరు చెప్పిబతుకుతున్న వారిని అదుపు.. ఎందుకిలా జరుగుతున్నాయో..? అందరికీ అవగాహన కల్పించాలి. ఇది అంతతొందరగా అయ్యే పనికూడా కాదు. కాని ప్రయత్నం చేయాల్సిందే.

ఇటువంటి ఘటన నీకు సంబంధించిన వారికి జరిగినా.. ఇలానే స్పందిస్తారా..? అంటూ నన్ను నిందించే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఎవరికి జరిగినా.. బాధాకరమే. ఒక్క క్షణం ఆలోచించి చూడండి. హత్యాచారానికి పాల్పడ్డవారిని చంపినంత మాత్రానా..? సమస్య పరిష్కారం జరుగదు. మూలాలను నాశనం చేయడానికి ప్రయత్నించాలి. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here