Home breaking news ప్రమాణ స్వీకారంలో పోటా పోటీ జిందాబాద్​లు.. కౌగిలింతలు

ప్రమాణ స్వీకారంలో పోటా పోటీ జిందాబాద్​లు.. కౌగిలింతలు

205
0

మీడియా రాసినట్టుగానే మంత్రివర్గ విస్తరణలో వాళ్లకే అవకాశాలొచ్చాయి. విస్తరణ జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. హరీశ్​రావు, కేటీఆర్​ పేర్లతో.. వారివారి అనుచరవర్గం పోటాపోటీ జిందాబాద్​ నినాదాలు చేశారు. వీళ్లిద్దరు కూడా పోటాపోటీగా కౌగిలింతలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ను రాజకుమారుడిగానే అందరూ భావించుకున్నట్టున్నారు. అందుకే మంత్రులు.. నేతలందరూ కేటీఆర్​ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కౌగిలించుకున్నారు. కుర్చీలో కూర్చున్న వాళ్లందరూ లేచి ఎదురుగా వెళ్లి మరీ ఆరాటపడి కౌగిలించుకున్నారు. కొత్తగా మంత్రి పదవులకు ఎంపికైన మాజీ మంత్రి సబితా, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్..​ కేటీఆర్​కు ఎదురుగా వద్దకు వెళ్లి మరీ పలకరించి నమస్కరించారు. హరీశ్​రావును మాత్రం ఆయన వస్తున్న సమయంలో ఎదురుగా ఉన్నవాళ్లే పలకరించారు. కౌగిలించుకున్నారు. ఈ సమయంలో కేటీఆర్​, హరీశ్​రావును ఉద్దేశిస్తూ పోటా పోటీ నినాదాలు చేశారు.

అందరి డిమాండ్​ మేరకు కేటీఆర్​కు మంత్రిగా అవకాశమిచ్చినట్టు మీడియా రాసింది. పార్టీలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం లేకుండా హరీశ్​రావుకు అవకాశమిచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్​లోని పువ్వాడ అజయ్​, సబితా, సత్యవతి రాథోడ్​, యూటీ(ఉద్యమ తెలంగాణ) బ్యాచ్​కు చెందిన హరీశ్​రావుకు అవకాశమిచ్చారు. కేటీఆర్​కు పుత్రాభిమానం, బీటీ బ్యాచ్​ డిమాండ్​ కారణంగా మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈటల రాజేందర్​ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఆ ప్రయత్నాలు చేసినట్టుగా మాత్రం స్పష్టమవుతోంది. అయితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమోనన్న అనుమానంతో ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పుత్రాభిమానం.. ఆందోళన.. కారణంగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. పుత్రాభిమానంతో కేటీఆర్​కు, ఆందోళన కారణంగా హరీశ్​రావుకు మంత్రి పదవి ఇచ్చారు. ఆందోళన కారణంగానే.. ఈటలను తప్పించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here