Home breaking news ప్రధాని కుర్చీపై మీరే.. రాహుల్ ను నమ్మించి నట్టేట

ప్రధాని కుర్చీపై మీరే.. రాహుల్ ను నమ్మించి నట్టేట

170
0
రాహుల్ స‌హా ఇత‌ర కాంగ్రెస్ ముఖ్య నాయ‌కులు (ఫైల్‌ఫొటో)

చంద‌మామ క‌త‌లు చెప్పిన నేత‌లు
న‌మ్మిన రాహుల్ అండ్ కో

చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కిరావే.. గోగిపోలు తేవే.. ఏది గుర్తున్నా.. లేకున్నా.. ఇది మాత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. చందమామను పిల్లలకు తల్లులు చూపిస్తూ.. అప్పట్లో గోరు ముద్దలు తినిపించేవారు. పైన తల్లులు పాడిన పాటలో ఏ ఒక్కటి నిజం కాదు. కానీ.. పిల్లలు సంబురంతో తినేవారు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మన రాహుల్ బాబుకు కూడా అచ్చంగా అట్లనే ప్రధానమంత్రి కుర్చీని చందమామ మాధిరిగా చూపించి.. మనమే గెలుస్తున్నాం.. మీరే ప్రధానమంత్రి అని నమ్మబలికి ముంచేశారంట కొందరు కాంగ్రెస్ ప్రముఖులు. వీరు మన రాహుల్బాబుకే కాదు.. సోనియాకు, ప్రియాంకకు కూడా చూపించరంట చందమామను. ఆళ్లు చెప్పిన కతలను నమ్మిన మన రాహుల్బాబు అండ్ కో (కుటుంబం).. ఫలితాలు చూసి బిక్కచచ్చిపోయారు. రాహుల్బాబును కాంగ్రెస్ ప్రముఖులు మాటలతో మోసం చేసిన విషయా ప్రముఖ పత్రిక The Guardian ఆదివారం సంచికలో Rahul’s own team fed his PM hopes right up to poll defeat శీర్షికతో ప్రచురించింది. ఇదే కథనాన్ని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోని పత్రికలు ప్రచురించాయి. ఈ కథనం సారాంశమేమిటంటే.. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సొంతంగా 164 నుంచి 184 సీట్ల వరకూ వస్తాయి. మీరే ప్రధానమంత్రి. సన్నాహాలు కూడా చేసుకోండి అని రాహుల్బాబుకు కాంగ్రెస్ శ్రేణులు నమ్మించాయంట. ఇంకా కుర్చీలో కూర్చోవడానికి సన్నాహాలు కూడా చేసుకోమని.. మంత్రివర్గాన్ని కూడా తయారు చేసుకోమని చెప్పాయంట. వారి మాటలను నమ్మిన రాహుల్ బాబు.. డీఎంకే నేత స్టాలిన్, ఎస్పీ నేత అఖిలేష్ సహా వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతల మద్దతు కోరడంతో పాటు.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖలు రాసి రడీగా పెట్టుకున్నారంట. తమకు అనుకూలంగా ప్రజాతీర్పు వస్తుందన్న ఉద్దేశంతో.. మే 23న కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద 10 వేల మందితో భారీ ఎత్తున ఉత్సవాలు జరపడానికి ఏర్పాట్లు కూడా చేశారని ద గార్డియన్ తన కథనంలో పేర్కొంది. ఫలితాలు వెలువడిన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. ఆ తరువాత రాహుల్ రాజీనామా సీన్.. బుజ్జగింపులు వగైరా నడిచిన సంగతి కూడా తెలిసిందే. పైన చెప్పినట్టుగా నడిచిన తతంగానికి కాంగ్రెస్ శక్తియాప్ నిర్వహించే డేటా విశ్లేషకుడిగా వ్యవహరించిన కల్యాణ చక్రవర్తి, సోషల్ మీడియా బాధ్యురాలు దివ్యస్పందన కారణమని పేర్కొంది. ఫలితాలు వెలువడిన తర్వాత వీరిద్దరూ కన్పించడం లేదంట. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీగా పేరున్న కాంగ్రెస్, ఆ పార్టీ యువ దిగ్గజం రాహుల్బాబు చందమామను చూసిన చిన్నపిల్లల మాధిరిగా మైమరిచి.. ఆదమరిస్తే ఎలా..? అన్నదే ఇక్కడ అర్థం కాని విషయం. సో రాహుల్బాబు అండ్ కో (కుటుంబం) ఆశలు ఆవిరైపోయాయి. వచ్చే ఎన్నికలకైనా పక్కా ప్రణాళికతో ముందుకొస్తారేమే చూద్దాం.

ద గార్డియ‌న్‌లో ప్ర‌చురిత‌మైన పూర్తి క‌థ‌నం చ‌ద‌వండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here