Home Travel పొగ మంచు తెరల్లో రమణీయమైన ప్రకృతి అందాలు

పొగ మంచు తెరల్లో రమణీయమైన ప్రకృతి అందాలు

144
0
తెల్లటి పొగమంచులో ఆకాశంలో విహరిస్తున్న పక్షులు

–వికాస్​ రుషి

కమ్ముకున్న పొగ మంచు తెరల్లో ప్రకృతి మరింత రమణీయంగా కన్నిస్తోంది. తెల్లటి మంచులో తెల్లగా ఉన్న కొంగల విహారం కంటికి కనువిందు చేస్తోంది. పంట చేలల్లోని గింజలను ముక్కుతో కరుచుకొని తాపీగా ఆరగిస్తున్నాయి. తమ లోకంలో తాముండి.. తాపీగా ఆరగిస్తుంటే పక్కనే రాయి పడిన శబ్దాన్ని విన్న అవి.. ఒక్కుదుటిగా ఆకాశంలోకి లేచి చక్కర్లు కొడుతున్నాయి.  మంచులో కప్పబడిన తాటిచెట్లు.. మేమూ ఉన్నామన్నట్టుగా తలలాడిస్తున్నాయి.

కనీకన్పించనట్టుగా రోడ్డు.. పక్కనే ఉన్న పచ్చని చెట్లు కూడా పిల్లనగ్రోవికి రాగానికి గోవులు మైమరిచినట్టుగా మంచు తెరలను చెదరగొడుతున్న గాలి సవ్వడికి స్పందిస్తూ ఊగిపోతున్నాయి.  రావాల్సిన సూర్యుడు రాగా.. మంచుతో తెల్లారినా తెల్లారనట్టున్న స్థితిలో ఎనిమిది కొట్టినా.. లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనాలు.  ఇటువంటి ప్రకృతి ఈ సీజన్​లో మనకు కన్పిస్తోంది. ఇటువంటిది ఎంత ఖర్చు చేసినా మరో సమయంలో మనకు కన్పించదు. వీక్షించండి మరీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here