Home breaking news పేల‌ని శ‌తృ*గ‌న్‌*

పేల‌ని శ‌తృ*గ‌న్‌*

94
0
  • వికాస్ రుషి

పేరు వ‌చ్చిన త‌రువాత కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌ను తామే గొప్ప‌వాళ్లుగా భావించుకుంటారు. తాము ఉన్నందునే.. ఈ వ్య‌వ‌స్థ స‌జావుగా సాగుతోంద‌ని.. తామే లేకుంటే ఈ వ్య‌వ‌స్థ న‌డవ‌ద‌న్న ఏకాభిప్రాయానికి వ‌చ్చేస్తారు. అందుకే వ్య‌వ‌స్థ‌ను ధిక్క‌రిస్తూ మాట్లాడుతుంటారు. దీన్ని మీడియా అందిపుచ్చుకొని ప‌తాక శీర్ష‌క‌లకు చేరుస్తారు. ఇది చూసిన వ్య‌క్తులు ఇక తమ‌కు తిరుగే లేద‌నుకుంటారు. ఇటువంటి వారి జాబితాలో నిన్న‌టి వ‌ర‌కూ పాట్నాసాహిబ్‌ ఎంపీ శ‌తృఘ్న సిన్హా ఉన్నారు. ఈ గ‌న్ ఎన్నిక‌ల్లో పేలలేదు. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మీసాల‌తో క‌న్పించే తొలి హీరో శ‌తృఘ్న సిన్హా. ఆయ‌న బీజేపీలో చేరిన త‌రువాత 2009, 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచి ఎంపీ అయ్యారు. 2014లో మంత్రి ప‌ద‌వి ఆశించిన ఆయ‌న‌కు చుక్కెదురైంది. అప్ప‌టి నుంచి అస‌మ్మ‌తి స్వ‌రం పెంచారు. ప్ర‌త్యేకించి ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు.. దేశంలోని అన్ని ప‌త్రిక‌లు ప్ర‌ధానంగా ప్రచురించేవీ. ఈ ప‌రిణామంతో ఆయ‌న త‌నకు తాను గొప్ప వ్య‌క్తిగా భావించుకుంటూ మ‌రింత ప‌దునైన విమ‌ర్శ‌లు గుప్పించేవారు. ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. బీజేపీ నుంచి రిప్ల‌య్ మాత్రం రాలేదు. చివ‌ర‌కు ఆయ‌న 2019 లోక్స‌భ ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్లో చేరి అదే పాట్నాసాహిబ్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేశారు. ఆయ‌నకు పోటీగా కేంద్ర‌మంత్రి ర‌విశంకర్ ప్ర‌సాద్ను బీజేపీ రంగంలోకి దించింది. సీన్ కట్ చేస్తే.. శ‌తృఘ్న‌సిన్హా ఓడిపోయారు. ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ 3 ల‌క్ష‌ల ఓట్ల‌కు పైగా మెజార్టీ సాధించి గెలిచారు. ఇక్క‌డ పార్టీ అనేది వ్య‌వ‌స్థ‌. ఎవ‌రైనా దానికంటే గొప్ప‌వాళ్లు కారు. కాలేరు. అది ఏ పార్టీ అయినా.. స‌రే. త‌మ‌కు తామే గొప్ప‌వాళ్లుగా భావించుకునే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇటువంటి జాబితా జాతీయ స్థాయిలో, రాష్ట్ర‌స్థాయిలో చాంతాడంతా ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని తీసుకుంటే.. తెలుగుదేశం వీడిన దేవేంద‌ర్‌గౌడ్ క‌న్పిస్తారు. టీడీపీలో నెంబ‌ర్ టూ స్థానంలో కొన‌సాగిన ఆయ‌న తానే పార్టీని న‌డిసిస్తున్నాన‌ని, తాను లేకుంటే టీడీపీ లేద‌న్న భావన‌తో ఉండి చివ‌ర‌కు న‌వ తెలంగాణ అనే పార్టీ పెట్టి.. చేతులు కాల్చుకున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌జారాజ్యం ఏర్పాటు చేసి.. ఆ త‌రువాత తిరిగి టీడీపీలోనే చేరిపోయారు. జాతీయ స్థాయికి వెళ్తే.. బీజేపీని వీడి తిరిగి అదే పార్టీలో చేరిన వారిలో క‌ల్యాణ్‌సింగ్‌, ఉమా భార‌తి, యెడ్యూర‌ప్ప‌ ఉన్నారు. వీరిద్ద‌రూ పార్టీలు ఏర్పాటు చేసుకొని తిరిగి బీజేపీలో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక‌మంది. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి వేరు కుంప‌ట్లు పెట్టి స‌క్స్‌స్ అయిన వారున్నారు..ఫెయిలైన‌ వారూ ఉన్నారు. కానీ బీజేపీని వీడి స‌క్సెస్ అయిన వారు మాత్రం దాదాపుగా లేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here