Home breaking news పెట్టేదీ మనోడైతే ఎక్కడున్నా తున్కలే మాజీ ఎంపీ వినోద్​కో పదవి

పెట్టేదీ మనోడైతే ఎక్కడున్నా తున్కలే మాజీ ఎంపీ వినోద్​కో పదవి

198
0
మాజీ ఎంపీ వినోద్​కు నియామక పత్రం అందిస్తున్న సీఎం కేసీఆర్​

బంతిల ఎక్కడ కూకున్నా.. పెట్టెటోడు మనోడైతే.. తున్కలు ఎక్కువేస్తడు. ఈ ముచ్చట మన పెద్దోళ్లు ఎప్పుడో చెప్పిండ్రు. ఇప్పుడు తెలంగాణల అదే జరుగుతోంది. పదవి ఇచ్చెటాయన.. తీసుకుంటాయన దగ్గరోల్లే. అందుకే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్​కు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవోచ్చింది. ఆయనకిచ్చే పదవి కాయితంపైగా ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతకం చేసేసిండు. వినోద్​కు కేబినెట్​ మంత్రికిచ్చినట్టే బుగ్గకారు.. అన్నీ వచ్చేసినయ్​. మొన్నటి లోక్​సభ ఎన్నికల్ల కరీంనగర్​ సీట్ల పోటీ చేసిన వినోద్​కుమార్​ ఓడిపోయిండు. ఆయనపై బీజేపీ నాయకుడు బండి సంజయ్​ గెలిచిండు. పదవి లేక అటీటూ మూడ్నెళ్లయింది. సుట్టపాయనను ఉత్తగెట్ల ఉంచాలని కేసీఆర్​ ఆనుకున్నడో.. ? లేకుంటే వినోద్​ పోయి అడింగిండో. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్​.. అదే సంఘం ఉపాధ్యక్ష పదవిని వినోద్​కు ఇచ్చిసిండు. ఈ పదవిల వినోద్​ మూడేండ్లు ఉంటడు. పొడిగించదలుకుంటే.. పెద్ద కష్టమేమీ కాదు ఇచ్చేటాయన మనాయనే కాబట్టి. అందుకే పెద్దోళ్లు ఉత్తగనే చెప్పలేదు. బంతిల ఎక్కడ కూకున్నా.. పెట్టేటోడు మనోడైతే తున్కలు ఎక్కువే పడతయని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here