Home జాతీయం పీవీ గుట్టును సగం విప్పి.. స‌గం దాచిన చిన్నారెడ్డి

పీవీ గుట్టును సగం విప్పి.. స‌గం దాచిన చిన్నారెడ్డి

272
0
మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర్సింహారావు

అప్పుడ‌ప్పుడు కొన్ని లీకులు వ‌స్తుంటాయి. అవి నిజ‌మా.? అబ‌ద్ధమా..? క‌న్ప‌ర్మ్ చేసుకునే నాటికే కొత్త స‌మ‌స్యలు వ‌స్తుంటాయి. పాత అంశంపై అంత దృష్టి పెట్టం కూడా 1992 డిసెంబ‌ర్ 6న అంటే బాబ్రి మ‌సీదీను ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు కూల్చివేసిన రోజు.. ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర్సింహారావు.. మౌనంగా ఉన్నందునే బాబ్రిమ‌సీదు కూలిపోయింది. లేకుంటే అలా జ‌రిగేదీ కాద‌ని ప్ర‌చారమూ ఉంది.

దానిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు సాగుతుండ‌గానే.. ఎన్నిక‌ల స‌మ‌యం రావ‌డం 1996లో వాజ్‌పేయ్ ప్ర‌ధానిగా బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డడం.. 16 రోజుల‌కే కూలిపోవ‌డం, మ‌ధ్య‌లో దేవేగౌడ‌, ఐకే గుజ్రాల్ ప్ర‌ధాన‌మంత్రులు కావ‌డం వంటివి జ‌రిగాయి. మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి రావ‌డం వంటివి జ‌రిగిపోయాయి. ఇవి ప‌క్క‌న పెడితే పీవీ న‌ర్సింహారావు మౌనం కార‌ణంగానే.. బాబ్రి మ‌సీద్ కూలిపోయింద‌న్న‌ విష‌యాన్ని కాంగ్రెస్ బ‌హిరంగంగా ఒప్పుకోలేదు.

కానీ ఈనాడు అదే కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే అందునా తెలంగాణ‌కు చెందిన వాడు వివాద‌ర‌హితుడిగా పేరున్నా. చిన్నారెడ్డి పూర్తి నిజం చెప్ప‌కుండా స‌గం నిజాలే కక్కేశారు. పీవీ న‌ర్సింహారావు కార‌ణంగానే.. ఆనాడు బాబ్రిమ‌సీదు కూలిపోయింద‌ని తేల్చేశారు. ఈ కార‌ణంగానే మైనార్టీలు కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యార‌ని చెప్పుకొచ్చారు.

రాజకీయాలు వ‌ద్ద‌ని ఇంట్లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిపించి ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చోబెడితే.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడ‌ని త‌న‌కు ఎవ‌రూ పోటీ రాకుండా నాయ‌కులను తొక్కేశారంటూ చెప్పేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకో విష‌యం చెప్ప‌డం మ‌రిచిపోయిన‌ట్టున్నారు చిన్నారెడ్డి.. ఆనాడు బీజేపీ స‌హ‌కారం కార‌ణంగానే.. పీవీ ప్ర‌భుత్వం ఐదేళ్లు సాఫిగా న‌డిచింది. ఆనాడు అప‌ర చాణ‌క్యుడు అంటూ పొగిడి నేడు కొస‌రు నిజాలు చెప్పి అస‌లు నిజం దాచిపెడితే ఎలా..? చిన్నన్న‌

  • సాధ‌న‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here