Home breaking news పాలమూరులో 13 మంది కూలీలను మింగిన జాతీయ రహదారి

పాలమూరులో 13 మంది కూలీలను మింగిన జాతీయ రహదారి

196
0
పాలమూరులో 13 మంది కూలీలను మింగిన జాతీయ రహదారి
రోడ్డు ప్రమాద దృశ్యం

పాలమూరు జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం 13 మంది కూలీలను బలిగొంది. పొట్టకూటికి వెళ్లి.. ఇంటికి వస్తూ దుర్మరణం చెందారు. జిల్లాలోని మిడ్జిల్​ మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై వస్తున్న ఆటోను వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారు. మృతి చెందిన 13 మందిలో 11 మంది మహిళలే కావడం గమనార్హం. మృతులంతా కొత్తపల్లి గ్రామానికి చెందిన వారే. మృతుల్లో భార్య బర్తలు, తోడికోడల్లు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మృతుల కుటుంబీకులు.. గ్రామస్థులు అడ్డుకొని రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. చివరకు వైద్య ఖర్చులు భరించడంతో పాటు డబుల్​ బెడ్​రూం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

మృతుల వివరాలు 

ముదిగొండ వెంకటమ్మ (45), నెల్లికంట చంద్రమ్మ (45), బెల్లెపోగు వెంకటమ్మ (45), బెండేరు ఎల్లమ్మ (50), వడ్డె చెన్నమ్మ (50), ముడావత్‌ బిచాని (50), రాగుల శివలీల (45), మంగళగిరి బాలమణి (48), చిక్కొండ సాలమ్మ (50), ముడావత్‌ శివాజి (45), ముడావత్‌ చాందీ (42), ముడావత్‌ సక్రు అలియాస్‌ నేపాల్‌ (30), బొంకూరి పార్వతమ్మ (38) చనిపోయారు. ముడావత్‌ సక్రునాయక్, రాగుల ఇంద్రమ్మ, రాగుల జంగమ్మ, ఎరుకలి ఈదమ్మ, ముడావత్‌ దేవి పాలమూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here