Home breaking news పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ

పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ

186
0
తెలంగాణ హైకోర్టు

హైద‌రాబాద్ః కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనానికి ముందే.. కాంగ్రెస్ నుంచి గెలిచి.. ఫిరాయింపులు పాల్ప‌డిన వారికి నోటీసులు ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత‌లు హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌పై మంగ‌ళ‌వారం ఉన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ జ‌రిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో పాటు అసెంబ్లీ స్పీక‌ర్‌, కార్య‌ద‌ర్శి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన‌ ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ షబ్బీర్‌ అలీ గతంలో హై కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటీష‌న్‌పై కూడా మంగ‌ళ‌వారం హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. వీరితో పాటు టీఆర్ఎస్‌లో చేరిన‌ నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌ ప్రభాకర్‌రావు, దామోదర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌, ఆకుల లలితకు కూడా నోటీసులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here