Home జాతీయం పార్టీ కార్యకర్త.. కన్నతల్లి ఒకటే ప్రధాని నరేంద్రమోదీ

పార్టీ కార్యకర్త.. కన్నతల్లి ఒకటే ప్రధాని నరేంద్రమోదీ

200
0
పార్టీ కార్యకర్త.. కన్నతల్లి ఒకటే ప్రధాని నరేంద్రమోదీ
ప్రధాని నరేంద్రమోదీ

కార్యకర్తలను ఎలా చూసుకోవాలో ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరించారు. కార్యకర్త.. కన్నతల్లితో సమానమని ఉద్బోధించారు. భార్య రాగానే.. కన్నతల్లిని పట్టించుకోకుంటే ఎంత బాధపడుతుందో..? అధికారంలోకి రాగానే..కార్యకర్తను పట్టించుకోకుంటే.. అలానే బాధపడతారని వివరించారు.

ఎంపీలు పెళ్లి కొడుకులాంటి వారని.. భార్య రాగానే.. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లి భావించకుండా ఉండాలి. అధికారం రాగానే.. తనను పట్టించుకోవడం లేదని కార్యకర్త భావించే విధంగా వ్యవహరించకుండా చూసుకోవాలని నరేంద్రమోదీ బోధించారు. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఎంపీలు పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే ఎంపీలు మరోసారి ఎన్నికయ్యే అవకాశముంటుందన్నారు. ఎంపీగా గెలిచాం మంత్రినయ్యామన్నట్టుగా కాకుండా.. కింది స్థాయి కార్యకర్తగానే ప్రజల్లో పని చేయాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వారసత్వం ఆధారంగా కాదని, సిద్ధాంతపరంగా మాత్రమే వచ్చామని ఆయన పునురుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here