Home రివ్యూస్ పాపం హరీష్ రావు / Ts Ex Minister Harishrao

పాపం హరీష్ రావు / Ts Ex Minister Harishrao

140
0

జీవితంలో పూవులే కాదు. ముల్లు, రాళ్లు ఉంటాయి. రాజకీయ జీవితంలో ఇది మరీ ఎక్కువ. రాజకీయాల్లో పదవి ఉంటేనే గౌరవం. లేకుంటే పట్టించుకునే వారే ఉండరు. ఇదే పరిస్థితి ఇప్పుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుది.

ఆయన కంటే ముందు తెలుగు వాడు అందునా తెలంగాణ వాడు పీవీ నరసింహారావుకు పదవి లేని అనుభవం తెలుసుకుందాం., ముఖ్యమంత్రి, ప్రధానిమంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించిన పీవీ, అపర చాణక్యుడిగా పేరు పొందారు. అలాంటిది.. మాజీ ప్రధానిగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగిన తరువాత అయినను ఎవరూ పలకరించిన పాపాన పోలేదట. తుపాకి మోతకు పిట్టలు. చెదిరి పోయినట్టుగా.. ఎదురుగా వెళ్తే ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అన్న ఉద్దేశ్యంతో దూరంగా వెళ్లిపోయారట. సరే ఇప్పుడు హరీష్ వద్దకు వద్దాం. గత శాసనసభలో మంత్రిగా హరీష్ రావు, సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని హరీష్ మామ, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. టీఆర్ ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి, పార్టీకి ఎన్నో రకాలుగా సర్వీస్ చేశారు. ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈసారి మంత్రివర్గంలో కేసీఆర్.. హరీష్ కు అవకాశం కల్పించలేదు. సమర్థవంతంగా పని చేసినప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ తనతో పాటు హరీష్ ను ఎంపీగా తీసుకొని పోతాడట.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి గా చేస్తారట. ఇలా ఊహలు. సరే ఇదంత ఎందుకు.. మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన నివాసం, కార్యాలయం జనాలతో కిట కిట లాడిపోయేది. పదవి పోయేసరికి నిర్మానుష్యంగా మారిపోయింది. మంత్రి పదవి రాక పోయేసరికి..కార్యాలయం ఖాళీ చేయమని నోటీస్ కూడా ఇచ్చారట. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆయనను పట్టించుకున్న వారే లేకుండా పోయారు. అంతెందుకు ఘనత వహించిన మీడియా ప్రతినిధులు కూడా ఆయనను పలకరించిన పాపాన పోలేదంట. ఆయనను పలకరిస్తే.. వేరే వాళ్లకు కోపమొస్తే ఇలా.. మనం పీవీ జరిగిన అవమానం చూడలేదు కానీ.. హరీష్ పరిస్థితి చూస్తే పాపం అనుకోవాల్సిందే. ఇక్కడ ఇంకో సంగతి కూడా ఉంది.

మొన్నటి వరకూ హొంమంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి.. కౌన్సిల్ సమావేశాల సందర్భంగా.. అక్కడికి వచ్చారు. ఎదురుగా పోలీస్ ఉన్నతాధికారులు, ద్వితీయ శ్రేణి ఉన్నతాధికారులు ఉన్నా నాయినిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం సెల్యూట్ కొట్టాడు. పాపం అన్పించట్లే. పదవి లేని రాజకీయ నాయకుడిని, అప్పుల పాలైన కోటీశ్వరుడిని, సినిమాలు లేని హీరోను ఎవరూ పట్టించుకోరు. అందుకే మనిషి అరాటపడుతాడు.. అందనిదాని కోసం. అందిందా అదృష్టవంతుడు. లేకుంటే దురదృష్టవంతుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here