Home breaking news పాకిస్థాన్‌లోనే మ‌సూద్ అజ‌హ‌ర్- పాక్ మంత్రి అంగీకారం

పాకిస్థాన్‌లోనే మ‌సూద్ అజ‌హ‌ర్- పాక్ మంత్రి అంగీకారం

199
0

పుల్వామా ఉగ్ర‌దాడికి కార‌కుడై 40 మంది భార‌తీయ‌ వీర జ‌వాన్ల‌ను పొట్ట‌న పెట్టుకున్న జైషే మహ్మ‌ద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. ఈ విష‌యాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి వెల్ల‌డించారు. అయితే పుల్వామా దాడిలో మ‌సూద్ ప్ర‌మేయం ఉన్న‌ట్టు భార‌త్ సాక్షాధారాలు చూపిస్తే.. అత‌డిని అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పైగా మ‌సూద్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని, న‌డ‌వ‌లేని స్థితిలో ఇంటిలోనే ఉంటున్నార‌ని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నాడ‌ని చెప్ప‌డం ద్వారా పుల్వామా దాడితో మ‌సూద్‌కు సంబంధం లేద‌న‌ట్టుగా ప‌రోక్షంగా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా కన్పిస్తఓంది. ఈ మేర‌కు ఖ‌రేషీ వెల్ల‌డించిన‌ట్టు పాకిస్థాన్‌ ప‌త్రిక డాన్ త‌న వెబ్‌సైట్‌లో ఒక క‌థ‌నం పోస్టు చేసింది. ఒక‌ వార్త సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించార‌ని త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. పుల్వామా ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌డంతోనే ఇది మా చ‌ర్యే అని జైషే మ‌హ్మ‌ద్ స్వ‌యంగా ప్ర‌క‌టించుకుంది. ఆ సంస్థ ప్ర‌క‌టించుకున్న త‌రువాత కూడా ఆధారాలు చూపించాల‌ని, అవి త‌మ దేశ న్యాయ‌స్థానాల‌కు ఆమోద‌యోగ్యంగా ఉండాల‌ని మంత్రి పేర్కొన‌డం విడ్డూర‌మే. ఖురేషీ తాను చేసిన ప్ర‌క‌ట‌న ద్వారా మ‌సూద్‌ను అరెస్ట్ చేసే ఉద్దేశం లేన‌ట్టు చెప్పిన‌ట్ట‌యింది. పైగా తాము శాంతిని కాంక్షిస్తున్నామంటూ ఖురేషీ సుద్దులు చెప్పారు. అయితే ఖురేషీ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ద్వారా ఉగ్ర‌వాద శిబిరాలు త‌మ దేశంలోనే ఉన్న‌ట్టు అంగీక‌రించిన‌ట్ట‌యింది. కాగా మ‌సూద్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించాల‌ని భార‌త్ స‌హా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్ ఒత్తిడి తెస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here