Home breaking news పాకిస్థాన్‌కు బ‌ల‌మిస్తున్న‌ ప్ర‌తిప‌క్షం – ప్ర‌ధాని మోదీ

పాకిస్థాన్‌కు బ‌ల‌మిస్తున్న‌ ప్ర‌తిప‌క్షం – ప్ర‌ధాని మోదీ

149
0

కేవ‌లం నా మీద వ్య‌తిరేకం, అధికారం మీద వ్యామోహంతో ప్ర‌తిప‌క్షాలు పాకిస్థాన్‌కు బ‌ల‌మిచ్చే విధంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆరోపించారు. విజ‌య సంక‌ల్ప్ లో భాగంగా బిహార్‌లోని పాట్నాలో నిర్వ‌హించిన ర్యాలీలో ఆయ‌న మాట్లాడారు. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో జ‌రిగిన వైమానిక దాడుల ఆధారాలేమున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నవిష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ పై విధంగా మాట్లాడారు. న‌న్ను, ప్ర‌భుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు వాయుసేన దాడులకు ఆధారాలేమిటని ప్రశ్నిస్తూ మన బలగాల నైతిక స్తైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలు ప్రయతిస్తున్నాయని ప్రశ్నించారు. మన శత్రువుకు బలం చేకూర్చే ప్రకటనలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయ‌న‌ నిలదీశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల‌వాల్సిన త‌రుణంలో ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా 21 పార్టీలు జట్టుక‌ట్టాయ‌ని ఆరోపించారు. దేశ ప్ర‌జ‌లు అన్ని విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని, ప‌క్క‌దేశానికి బ‌లం చేకూరుస్తున్న ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని ఆయ‌న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here