Home తాజా వార్తలు పబ్లిసిటీ విషయంలో రాంగోపాల్ వ‌ర్మ ముందు ప్రశాంత్ కిశోర్ ఏపాటి

పబ్లిసిటీ విషయంలో రాంగోపాల్ వ‌ర్మ ముందు ప్రశాంత్ కిశోర్ ఏపాటి

170
0
పబ్లిసిటీ విషయంలో రాంగోపాల్ వ‌ర్మ ముందు ప్రశాంత్ కిశోర్ ఏపాటి
రాంగోపాల్ వ‌ర్మ, ప్రశాంత్ కిశోర్

పబ్లిసిటీ విషయంలో దర్శకుడు రాంగోపాల్​ వర్మ ముందు అందరూ దిగదుడుపే. రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్​ కిషోర్ అనబడే పీకే కూడా పనికిరాడు. ఈ పీకే అనే వ్యూహకర్త.. రాజకీయ పార్టీల గెలుపు ఓటములకు వ్యూహాలు రచిస్తూ ఉంటారు. మొన్నటి ఏపీ ఎన్నికలకు వైఎస్​ జగన్​ కోసం నవరత్నాలు రూపొందించింది ఈయనే. ఇప్పుడు బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం రత్నాలు రూపొందించే పనిలో ఉన్నాడు.

సరే వర్మ వద్దకు వద్దాం. రామ్​ హీరోగా పూరీ జగన్నాథ్​ రూపొందించిన ఇస్మార్ట్​ శంకర్​ సినిమా చూడడానికి .రాంగోపాల్ ​వర్మ, ఆర్​ఎక్స్​ 100 ఫేమ్​ అజయ్​ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్​ ఆగస్త్య కలిసి ముగ్గురు ఒకే బైక్​పై మూసాపేటలోని శ్రీరాములు థియేటర్​కు వెళ్లారు.  వెళ్లినోళ్లు వెళ్లినట్టు వెళ్లక.. తమకు హెల్మెట్​ లేదు. ముగ్గురం వెళ్తున్నా పోలీసులేం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా సోషల్​ మీడియాలో ఫొటో పోస్టు చేశారు. ఇక చూడు మీడియాలో గంటలపాటు కథనాలే కథనాలు. చివరకు రూ. 1335 జరిమానా విధించారు పోలీసులు. కానీ టీవీల్లో లక్షల రూపాయల పబ్లిసిటీ ఉచితంగా కొట్టేశాడు రాంగోపాల్​ వర్మ. ఇక్కడి వరకూ ఓటైపు. ఇస్మార్ట్​ శంకర్​ సినిమా సక్సెస్​ పార్టీలో మరోరకమైన పబ్లిసిటీ చేసుకున్నారు వర్మ. 

రాంగోపాల్​ వర్మ ట్విట్టర్​ నుంచి వీడియో

CHAMPAGNE CELEBRATINGలో  బాటిల్​ ఓపెన్​ చేసుకొని..తన మీద తాను పోసుకోవడంతో పాటు.. దర్శకుడు పూరీ జగన్నాథ్, పక్కనే ఉన్న నబా నటేశ్​, నిధి అగర్వాల్​​పై కూడా ఒంపేయడంతో పాటు వారిని బలంగా హత్తుకున్నాడు. ఈ సీన్​ తన ట్విట్లర్లో పోస్ట్​ చేసేశాడు వర్మ. ఈ పోస్టులను క్షణాల్లో ఎగబడి చూసేశారు వేలమంది. ఇంకా చూస్తున్నారు కూడా. ఇప్పుడు చెప్పండి. పబ్లిసిటీలో వర్మను మించిన వారు ఉన్నారా..?వర్మ ముందు ఈ ప్రశాంత్​​ కిశోర్​ ఏపాటి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here