Home breaking news పదవుంటేనే పవర్ అప్పుడు అంతా మనదే.. లేకుంటేనే చనా కష్టం

పదవుంటేనే పవర్ అప్పుడు అంతా మనదే.. లేకుంటేనే చనా కష్టం

286
0

పదవికున్న పవర్​ మనిషికుండదు. మనిషికి ఎంత పవర్​ ఉన్నా.. పదవి లేకుంటే అది పని చేయదు. ఇది అందరికీ తెలిసిన గొప్ప సత్యమే. కనీ కొందరు అర్థం చేసుకోరు. మనిషి.. మానవత్వం.. మంచితనం.. ఇలా ఏవోవో ముచ్చట్లు చెబుతుంటారు. సరే ఇదంతా సోది ఎందుకు. ఏపీలో పదవి పోయిన చంద్రబాబును చూస్తున్నాము. పేపర్లో రోజూ ఫస్ట్​ పేజీలో కన్పించే బాబు.. లోపలిపేజీల్లో అది కూడా రెండు, మూడు కాలాల న్యూస్​లో సెట్టయిండు.

ఇప్పుడు తెలంగాణ ముచ్చటకు వస్తే. కవిత అదే కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ చివరి మూమెంట్​లో బతుకమ్మ ఆటతో దూసుకొచ్చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచారు. కేంద్రమంత్రి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కుదరలేదు. జాగృతి సంస్థ ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటను పెద్ద ఎత్తున నిర్వహించారు. కవిత అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే కవితమ్మ అన్న స్టేజీకి ఆమెను తీసుకొచ్చారు టీఆర్​ఎస్​ వాళ్లు. ఎంపీగా ఉన్నన్ని రోజులు ఆమె ఏం చెబితే అదే వేదం. కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్​లో చేరిన డీఎస్​ అనేబడే ధర్మపురి శ్రీనివాస్​.. చివరకు అవమానకర రీతిలో బయటే నిలబడి ఉన్నారు. దీనికి కవితే కారణమన్న వారు లేక పోలేదు. ఏకంగా టికెట్లను కూడా అనౌన్స్​ చేశారు.

మొన్నటి ఎన్నికల్లో కవిత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్​ బతుకమ్మ పండుగ ఇది. పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కవిత కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 300 చోట్ల హంగామాగా నిర్వహిస్తామన్నారు. ఏమైందో తెలీదు కానీ.. చిన్న బతుకమ్మ పండుగ రోజు ఆమె తన ఇంటిలోనే నలుగురితో కలిసి ఆడుకున్నారు. ఆ వీడియోను ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్​ చేసుకున్నారు. ఈ వీడియో చూసినోళ్లందరూ కవిత ఇలా తన ఇంట్లోనే ఆడుకోవడమేమిటీ..? జాగృతి ఏమైంది. ఆనాటి హంగామా ఏమైంది. ఇలా కొచ్చన్ల మీద కొచ్చెన్లు వేసుకుంటున్నారు.

నిజమే ఆనాడు కవిత ఎంపీ.. పదవిలో ఉన్నారు శాసించే పవరుంది. ఈనాడు పదవిలో లేరు.? అంతే తేడా. కవిత సింపుల్​గా బతుకమ్మ ఆడారు అని టీఆర్​ఎస్​ వాళ్లు అంటే అనొచ్చు. పదవిలో ఉన్నప్పుడు సింపుల్​గా ఉంటే వేరు. అప్పుడు హంగామాగా ఉండి. ఇప్పుడు లేకుంటేనే క్వచ్ఛన్​. పదవి ఉండి పదవి లేకుంటే ఎంత తేడా ఉంటుందో ఇక్కడ రెండు శాంపిల్స్​ కన్పించాయి. ఇలాంటి శాంపిల్స్​ దేశంలో ఎన్నో. నేటి రాజకీయాలు ఎలా ఉంటాయో మోహన్​బాబు నటించిన ‘ఎం ధర్మరాజు ఎంఏ’ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా 1994లో విడులైంది. సత్యనారాయణ, మోహన్​బాబు మధ్య నడిచే కొన్ని సీన్స్​ చూస్తే చాలు రాజకీయం మొత్తం అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here