Home breaking news పంజాబ్‌లో కాషాయ‌, కామ్రెడ్ల సంయుక్త స‌ర్కార్‌ | Samyukta Vidhayak Dal

పంజాబ్‌లో కాషాయ‌, కామ్రెడ్ల సంయుక్త స‌ర్కార్‌ | Samyukta Vidhayak Dal

107
0
  • వికాస్ రుషి

కాషాయం, కామ్రెడ్ల‌ను ఉప్పు నిప్పుతో పోలుస్తుంటారు. సిద్దాంతం కోసమే పాటుప‌డ‌తాయి త‌ప్ప అధికారం కోసం కాదంటారు. కాషాయం జెండా క‌ల్గిన‌ బీజేపీని మ‌త‌త‌త్వ పార్టీగా, ఎర్ర‌జెండా ప‌ట్టుకున్న క‌మ్యూనిస్టుల పార్టీల‌ను కార్మికుల కోసం నిలిచిన పార్టీగా మీడియాలో పాతుకొని పోయిన కామ్రేడ్లు చెబుతుంటారు. ఇదే రీతిన ప్ర‌చారం కూడా చేస్తుంటారు. ఈ రెండు ఎట్టి ప‌రిస్థితుల్లో క‌లిసే ప్ర‌సక్తే ఉండ‌ద‌ని కూడా బోధిస్తుంటారు. కానీ ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేసి, మంత్రివ‌ర్గంలో కొన‌సాగిన ఉదంతాన్ని మాత్రం ఎవ‌రూ చెప్ప‌రు.. చెప్పుకోరు కూడా.. విష‌యానికి వ‌స్తే
దేశంలో కాంగ్రెస్‌కు ఎదురొడ్డే వారు ఎవ‌రూ లేరంటూ.. 1967కు ముందు విస్తృత ప్ర‌చారం. ఈ ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయాల‌ని కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌క్షాలన్నీ ఒక‌ నిర్ణ‌యం తీసుకున్నాయి. అప్ప‌టికే కాంగ్రెస్ నుంచి ఒక వ‌ర్గం చీలిపోయి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంది. విప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి 1967లో సంయుక్త విధాయ‌క్ ద‌ళ్‌(Samyukta Vidhayak Dal)గా ఏర్పడ్డాయి. ఈ కూట‌మిలో భార‌తీయ క్రాంతిద‌ళ్‌, సంయుక్త సోష‌లిస్ట్ పార్టీ, ప్ర‌జా సోష‌లిస్ట్ పార్టీ, భార‌తీయ జ‌న‌సంఘ్ (బీజేపీ పూర్వ‌రూపం), అకాళీద‌ళ్ (సంత్‌) సీపీఐ, సీపీఎం భాగ‌స్వామ్యంగా ఉన్నాయి. ఈ పార్టీల‌న్నీ క‌లిసి బిహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, మ‌ద్రాస్‌, కేర‌ళ రాష్ట్రాల్లో పోటీ చేశాయి. అయితే ఏఏ రాష్ట్రాల్లో బ‌ల‌మున్న పార్టీలూ ఆయా రాష్ట్రాల్లో క‌లిసి కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. ఆ స‌మ‌యంలో బిహార్‌, రాజ‌స్థాన్‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏర్పాటైన సంకీర్ణ సర్కార్‌లో భాగ‌స్వామ్య‌ప‌క్షాలుగా మంత్రివ‌ర్గంలో చేరాయి. మ‌ద్రాస్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో డీఎంకే కూట‌మిలో సీపీఎం పోటీ చేయ‌గా.. సీపీఐ, బీజేఎస్‌(బీజేపీ) వేర్వేరుగా ఒంట‌రిగా పోటీ చేశాయి. ఆ ఎన్నిక‌ల్లో డీఎంకే గెలిచి అన్నాదురై ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

పంజాబ్ స‌ర్కార్‌లో కాషాయ కామ్రెడ్లు

పంజాబ్‌లో అకాలీద‌ళ్‌, బీజేఎస్‌, సీపీఐ, సీపీఎం, ఆర్‌పీఐ, ఎస్ఎస్‌పీ, ఏడీఎం కూటమిగా ఏర్ప‌డి పోటీ చేశాయి. ఈ కూట‌మి 47 సీట్లు గెలుచుకోగా.. స్వతంత్రులు 9 మంది గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 48 స్థానాలను గెలుకుంది. స్వతంత్రుల‌తో క‌లిసి సంకీర్ణ స‌ర్కార్ ఏర్పాటైంది.

1967లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీల వారీగా గెలిచిన సీట్లు

Bharatiya Jan Sangh (BJS) 9
Communist Party of India (CPI) 5
Communist Party of India (Marxist) (CPM) 3
Akali Das Sant Fateh Singh Group (ADS) 24
Republic Party of India (RPI) 3
Sanghata Socialist Party (SSP) 1
Akali Dal Master Tara Singh Group (ADM) 2
Independent (IND) 9
Indian National Congress (INC) 48
Total 104

పంజాబ్‌లో ఏర్పాటైన ఈ సంకీర్ణ స‌ర్కార్‌లో ఆకాలీద‌ళ్ (సంత్‌)కు చెందిన గురునామ్ సింగ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్లుగా రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అకాళీద‌ళ్‌కు చెందిన ఎమ్మెల్యేలు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆనాటి మంత్రివ‌ర్గంలో భార‌తీయ జ‌న‌సంఘ్‌(నేటి బీజేపీ), క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ), క‌మ్యూనిస్టు పార్టీ ఇండియా మార్కిస్ట్ (సీపీఎం) భాగ‌స్వాములుగా ఉన్నాయి. బీజేపీ ఏర్ప‌డిన త‌రువాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని హ‌న్మ‌కొండ ఎంపీ సీటును 1984లో కామ్రెడ్లు, టీడీపీ (ఎన్టీఆర్ హ‌యాంలో) మ‌ద్ద‌తుతో గెలుచుకున్న‌ది. దేశంలో బీజేపీ గెలిచిన రెండు సీట్ల‌లో హ‌న్మ‌కొండ ఒక‌టి.

1967లో సంయుక్త విధాయ‌క్ ద‌ళ్‌ ప్ర‌భుత్వాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గోవింద్ నారాయ‌ణ్ సింగ్ (సంయుక్త విధాయ‌క్ ద‌ళ్‌)
బిహార్ ముఖ్య‌మంత్రి ప్ర‌సాద్ సిన్హా
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌సింగ్ (క్రాంతిద‌ళ్‌)
ప‌శ్చిమ‌బెంగాళ్ ముఖ్య‌మంత్రి అజ‌య్ క‌రుణాక‌ర్ ముఖ‌ర్జీ (బంగ్లా కాంగ్రెస్‌)
పంజాబ్ ముఖ్య‌మంత్రి గురునామ్ సింగ్ (అకాలీద‌ళ్ (సంత్‌)
ఒడిశా ముఖ్య‌మంత్రి రాజేంద్ర నారాయణ్ సింగ్ (స్వ‌తంత్ర పార్టీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here