Home breaking news పంచుకోవడానికే.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశం

పంచుకోవడానికే.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశం

134
0
పంచుకోవడానికే.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్​, జగన్​ సమావేశాలు
తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్​, జగన్​

హైదరాబాద్: దాచింది.. దోచుకున్నది.. పంచుకోవడానికే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమవుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో జరిగిన అవినీతి ఆర్థిక లావాదేవీలను భూ దందాలను ఇరువురు ముఖ్యమంత్రులు అడ్డదారుల్లో పరిష్కరించుకునేందుకే తరచుగా భేటీ అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి నాటకాలు ఆడిన కేసీఆర్ ప్రస్తుతం జగన్ తో అలాంటి నాటకాలే ఆడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల జగన్ అనుచరులు సాధించిన భూదందాలు, ఆర్ధిక లావాదేవీల్లో వాటాలు పంచుకునేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు అని ఆరోపించారు.

కేసీఆర్, జగన్ లు ఎన్నిసార్లు భేటీ అయిన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోలేరన్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి బలమైన జాతీయ నాయకత్వం సుపరిపాలన అంత్యోదయ అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం సాధిస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తీరు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జగన్ ల తో వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తుపాకి రాముడు మాయల ఫకిర్ వేషాలతో తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో శిక్ష విధిస్తారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here