Home Uncategorized న‌మ‌స్కారం.. భార‌తీయ సంస్కారం

న‌మ‌స్కారం.. భార‌తీయ సంస్కారం

207
0

కాలం మారుతోంది. టెక్నాల‌జీ పెరుగుతోంది. ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచిన భార‌తీయ సంస్కృతిలో పెనుమార్పులు వ‌స్తున్నాయి. ఆధునిక‌త పేరుతో సంస్కృతి, సంప్ర‌దాయాలు మారిపోతున్నాయి. మ‌న సంస్కృతిలో సంస్కారానికి నిద‌ర్శ‌నంగా రెండు చేతులు జోడించి చేసే న‌మ‌స్కారానికి ప్రాధాన్యముండేది. ఆ న‌మ‌స్కారం స్థానంలో ఇప్పుడు *హ‌లో* హాయ్‌* చేరిపోయాయి. దేశ సంస్కృతిలో ముఖ్య‌మైన న‌మ‌స్కారం ప్రాధాన్యం తెలుసుకుందాం
మ‌న దేశంలో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లుసుకున్న‌ప్ప‌డు రెండు చేతులు జోడించి ఒక‌రినొక‌రు న‌మ‌స్కరించుకోవ‌డం పూర్వికులు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం. ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తిని చూడగానే చేతులు జోడించి నమస్కరించడం మ‌న భారతీయులు చేసే పని. ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. ఎదుటి వారిని ఎటువంటి అహంకారం లేకుండా స‌మున్న‌తంగా గౌర‌వించుకోవ‌డం భార‌తీయ ప‌ద్ద‌తి. ఈ ఆధునిక ప్ర‌పంచంలో మ‌న పూర్వికులు ప్ర‌వేశ‌పెట్టిన *న‌మ‌స్కారం* ప‌ద్ద‌తిని ఇంకా పాటించాలా.? అన్న ప్ర‌శ్న నేటి యువ‌త‌లో సందేహం క‌ల‌గ‌వ‌చ్చు.  ఆధునిక ప‌ద్ద‌తిలో *హాయ్‌, హ‌లో* అని చెప్పుకుంటే స‌రిపోతుంది క‌దా.? అన్న ప్ర‌శ్నకూడా తలెత్త‌వ‌చ్చు. కానీ.. మ‌న పూర్వికులు ఆచ‌ర‌ణ‌లో పెట్టిన గౌర‌వ‌పూర్వ‌క‌మైన‌ నమస్కారం కచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంద‌ని చెబుతున్నారు. మాన‌వుడి శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వేళ్లు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటే ఈ నమస్కారం. ఈ నమస్కరించటంలోనూ కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. భ‌గ‌వంతుడిని పూజించిన స‌మ‌యంలో  రెండు చేతులు సహస్రారంపై జోడించి న‌మ‌స్క‌రించాలి.  తోటివారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించి న‌మ‌స్క‌రించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడుకొని ఎనిమిది అవయవాలు  భూమిని తగిలేట్టుగా నమస్కరించాలి. ఇలా ప్ర‌తిసారి చేయ‌డం సాధ్యం కాదు కాబ‌ట్టి.. వారికి రెండు చేతులు  జోడించి త‌ల వంచి న‌మ‌స్క‌రించ‌డం ఉత్త‌మం. వీటితో పాటు మ‌నము ఎవ‌రికైనా ఫోన్ చేసినా.. ఎదుటివారు మ‌న‌కు ఫోన్ చేసినా.. *హలో* హాయ్‌* స్థానంలో చ‌క్క‌గా న‌మ‌స్కారం అని ప‌ల‌కరింపుతో సంభాష‌ణ ప్రారంభించ‌డం గౌర‌వ పూర్వ‌కంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here