Home తాజా వార్తలు న‌గ్నంగా న‌టిస్తుందా.. *అమె*లాపాల్ కు బుద్ది ఉందా..? నిర్మాత త‌మ్మారెడ్డి

న‌గ్నంగా న‌టిస్తుందా.. *అమె*లాపాల్ కు బుద్ది ఉందా..? నిర్మాత త‌మ్మారెడ్డి

222
0
ఆమె సినిమా పోస్ట‌ర్

అస‌లీ పిల్ల‌కు బుద్ధి ఉందా..? బుద్ధి ఉండే ఒప్పుకుందా..? ఈ సినిమా చేయ‌డానికి అంటూ ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కామెంట్ చేశారు. ఇంత‌కీ కామెంట్ ఎవ‌రిమీదంటే.. అమ‌లాపాల్ మీద‌. ఆమె న‌టించిన ఆడై సినిమాను తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా రైట్స్‌ను త‌మ్మారెడ్డి కొనుగోలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆమె సినిమా హీరోయిన్ అమ‌లాపాల్ ఇచ్చిన షాక్ నా న‌ల‌బై ఏళ్ల జీవితంలో ఎవ‌రూ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. న‌గ్నంగా న‌టించ‌డ‌మేమిటీ..? ఆమెకు బుద్ధి ఉండే న‌టించిందా..? అంటూనే ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవుతుందన్న ఉద్దేశంతోనే తాను కొనుగోలు చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఈ సినిమా క‌థ రాసిన ర‌త్న‌కుమార్‌కు, న‌గ్నంగా న‌టించిన అమ‌లాపాల్‌కు బుద్ధి లేద‌ని.. వారితో పాటు ఈ సినిమాను నిర్మించిన నిర్మాత కూడా పిచ్చోడిలా నిర్మించార‌ని చెబుతూ.. ఈ సినిమా తెలుగు రైట్స్ కొన్న నేను ఇంకా పెద్ద పిచ్చోన్నీ అని త‌మ్మారెడ్డి న‌వ్వుతూ వ్యాఖ్యానించారు.

అయితే సినిమా తీయ‌డం ఒక క‌ల‌. కానీ న‌గ్నంగా న‌టించ‌డానికి కూడా క‌థ‌లో ధైర్యం కావాలి. న‌టించడానికి ధైర్యం కావాలి అది అమ‌లాపాల్‌కు ఉందంటూ వ్యాఖ్యానించారు భ‌ర‌ద్వాజ‌. తెలుగు సినీరంగంలో అనేక సినిమాలు తీసిన త‌మ్మారెడ్డి మంచి సినిమాలు కూడా తీశారు. ఖ‌ర్చు పెరిగిపోయింద‌నుకున్నాడేమో.. ఈ మ‌ధ్యే త‌గ్గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here