Home Entertainment నోకియా 2.2 లాంచ్‌.. రూ.1000 తగ్గింపు ఆఫర్

నోకియా 2.2 లాంచ్‌.. రూ.1000 తగ్గింపు ఆఫర్

317
0

ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కంపెనీ నోకియా తాజాగా నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ వినియోగదారులకు నోకియా అందుబాటులోకి తెచ్చింది. వాటర్‌డ్రాప్‌ నాచ్‌, ఏఐ ఆధారిత రియర్‌, సెల్ఫీ కెమెరాలు ఈ స్మార్ట్ ఫోన్ ప్రధాన ఆకర‍్షణ. నోకియా 2.2 ఫీచర్లు 5.71 అంగుళాల డిస్‌ప్లే 720×1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ పై 9.0.13ఎంపీ రియర్‌ కెమెరా
5 ఏంపీ సెల్ఫీ కెమెరా. 3000 ఎంఏహచ్‌ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. నూతనంగా విడుదల చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లకు నోకియా లాంచింగ్‌ ఆఫర్‌ ఇస్తోంది. నోకియా 2.2 కొనుగోలు చేసిన జియో వినియోగదారులకు 2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు, 100 జీబీ డాటా ఉచితంగా ఇస్తోంది. ప్లిప్‌కార్ట్‌, నోకియా తదితర ఈ స్టోర్ల ద్వారా జూన్‌ 11 నుంచి అందుబాటులోకి ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. అయితే ప్రీబుకింగ్స్‌ నోకియా ఈ స్టోర్ల ద్వారా నేటి నుంచే ప్రారంభమైంది. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. 2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర రూ. 6,999. 3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు. అయితే ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే పరిమితం. జూన్‌ 30 తరువాత నోకియా 2.2 ధరలు రూ. 1000 చొప్పున పెరగనుంది. అంటే ..2జీబీ ర్యామ్‌ /16జీబీ స్టోరేజ్‌ధర రూ. 7,699
3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,699కి విక్రయిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here