అమరావతిః నేను కూడా చంద్రబాబు మాధిరిగా ఆలోచిస్తే.. ఈ సభలో ప్రతిపక్షమనేది ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆనాడు మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టుగా నేను కూడా టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడితే.. అక్కడ ఎవరుండరని.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండరని ఆయన స్పష్టం చేశారు. మా ఎమ్మెల్యేలను ఆనాడు అన్యాయంగా కొనుగోలు చేశారని తెలిపారు. అదేమంటే.. మాట్లాడే అవకాశము కూడా ఇవ్వలేదన్నారు. నేను వారిలా ఆలోచించనని చెప్పారు. ఈనాడు టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సభలో ప్రకటించారు. 5 గురు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్షనేతగా ఉండలేరన్నారు. ఒకవేల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తానని చెబితే.. ముందు వారిని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించిన తరువాతే తీసుకుంటానని ప్రకటించారు. జగన్ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నవ్వుతూ కూర్చున్నారు.
Home breaking news నేనూ బాబులా ఆలోచిస్తే.. ప్రతిపక్షముండదు.. నేతగా చంద్రబాబూ ఉండడు – వైఎస్ జగన్