Home breaking news నేను అలా చేస్తేనే.. సినిమాలో అవకాశమిచ్చారు తెల్సా.. శ్రద్ధా శ్రీనాథ్​

నేను అలా చేస్తేనే.. సినిమాలో అవకాశమిచ్చారు తెల్సా.. శ్రద్ధా శ్రీనాథ్​

99
0
నేను అలా చేస్తేనే.. సినిమాలో అవకాశమిచ్చారు తెల్సా.. శ్రద్ధా శ్రీనాథ్​
శ్రద్ధా శ్రీనాథ్​

నువ్వలా చేయ్​ అన్నారు. అలా చేసిన తరువాతే నాకు సినిమాల్లో అవకాశమిచ్చారని శాండిల్​వుడ్​ భామ, బహుభాషా నటి శ్రద్ధా శ్రీనాథ్​ చెప్పారు. కన్నడంలో యూ టర్న్​, తెలుగులో జెర్సీ చిత్రాల్లో నటించిన శ్రద్ధా నటిగా మంచి పేరే తెచ్చుకున్నారు. ఈ సినిమాలు విజయవంతమయ్యాయి కూడా. ఇంత సక్సెస్​ ఉన్నా.. సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంత కష్టమో తన అనుభావాలను విప్పి చెప్పారు శ్రద్ధా.

అజిత్ కథానాయకుడిగా.. శ్రద్ధా కథానాయకిగా నేర్కొండ పార్త్వె నిర్మాణమవుతోంది. ఈ సినిమాలో తనకు అవకాశం రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందంటూ శ్రద్ధా చెబుతున్నారు. ఈ సినిమాలో అవకాశమిస్తామని తనను పిలిపించి అడిషన్ టెస్ట్​ నిర్వహించారని, ఆ తరువాత మూడు వారాల వరకూ తనకు సమాచారమివ్వలేదని చెప్పారు. మళ్లీ తనను రమ్మని కొన్ని సీన్లలోనటింపచేశారని తెలిపారు. అయినప్పటికీ.. దర్శకుడు హెచ్​ వినోద్​కు సంతృప్తి కలగక.. నిన్ను నీ అభిమానులే అసహ్యించుకునే విధంగా నటించమని చెప్పడంతో అవాక్కయ్యాయనని.. అయినా ఆ సినిమాలో అవకాశం కోసం నా నటనను పూర్తిగా రంగరించి.. యాక్టింగ్​ చేసి చూపించానని తెలిపారు. ఆ తరువాతే తనకు  నేర్కొండ పార్త్వె  సినిమాలో అవకాశమిచ్చారని చెప్పుకొచ్చారు.

అజిత్​ కలిసి నటించడం తనకు మరుపురాని అనుభవమని పేర్కొన్నారు. ఇప్పుడు తాను సినిమాల్లో బిజి అయ్యాయని విశాల్​, మాధవన్​తో సినిమాలు చేస్తున్నట్టు శ్రద్ధా చెప్పారు. నేర్కొండ పార్త్వె సినిమాను నటి శ్రీదేవి భర్త బోనీకపూర్​ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఈ నెల 8న విడుదలకానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here