Home breaking news నిలిచిన చంద్ర‌యానం-2 ప్ర‌యోగం – త్వ‌ర‌లో మ‌ళ్లీ ప్ర‌యోగం

నిలిచిన చంద్ర‌యానం-2 ప్ర‌యోగం – త్వ‌ర‌లో మ‌ళ్లీ ప్ర‌యోగం

431
0
నిలిచిన చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం

నెల్లూరుః ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం అర్దాంత‌రంగా నిలిచిపోయింది. షెడ్యూల్ ప్ర‌కారం.. సోమ‌వారం తెల్ల‌వారుజామున 2.51 గంట‌ల‌కు చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగించాల్సి ఉంది. జీఎస్ఎల్వీ మార్క్‌3లో త‌లెత్తిన సాంకేంతిక కార‌ణాల వ‌ల్ల ప్ర‌యోగానికి స‌రిగ్గా 56.24 నిమిషాల ముందు కౌంట్ డౌన్ నిలిచిపోయింది. దీంతో ప్ర‌యోగాన్నినిలిపివేస్తున్న‌ట్టు ఇస్రో ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ఎప్పుడు ప్ర‌యోగిస్తామో త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఇస్రో అధికారులు తెలిపారు. చంద్ర‌యాన్-1 ప్ర‌యోగం ద్వారా చంద్రుడి క‌క్ష్య‌కు ఆర్బిట‌ర్‌ను ఇస్రో విజ‌యవంతంగా చేర‌వేసింది. ఆ త‌ర‌వాత చంద్రుడి మీద నీటి జాడ‌లు ఉన్న‌ట్టు ప్ర‌పంచానికి ప్ర‌క‌టించింది.

చంద్ర‌యాన్-2లో ఆర్బిట‌ర్‌తో పాటు చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే విక్ర‌మ్‌ ల్యాండ‌ర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించే విధంగా చేశారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. చంద్ర‌యాన్-2 ప్ర‌యోగానికి ఆదివారం ఉద‌యం 6.51గంట‌ల‌కు షార్‌లో అయితే ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల 24 సెకన్లు ఉండగా సాంకేతిక లోపాలతో కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. దీంతో ప్ర‌యోగాన్నినిలిపివేస్తున్న‌ట్టు ఇస్రో ప్ర‌క‌టించింది.

ఇస్రో ట్విట్ట‌ర్ నుంచి వీడియో

షెడ్యూల్ ప్ర‌కారం ఇలా
షెడ్యూల్ ప్ర‌కారం చంద్ర‌యాన్‌-2 సోమ‌వారం తెల్ల‌వారుజామున 2.51 గంట‌ల‌కు ప్ర‌యోగం జరిగితే.. జీఎస్ఎల్వీ రాకెట్ 16.13 నిమిషాలు రోదసిలో పయ‌నించి.. 181 మీట‌ర్ల ఎత్తులో కాంపోజిట్ మాడ్యూల్‌ను వ‌దిలేయ‌డంతో ప్ర‌యోగం మొద‌టి ద‌శ ముగుస్తుంది. ఆ త‌ర్వాత ఈ మాడ్యూల్ రోద‌సిలో 54 రోజుల పాటు ప్ర‌యాణం చేస్తుంది. సెప్టెంబ‌ర్ 6న ఆర్బిట‌ర్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ వీడి చంద్రుడిపై దిగుతుంది. ఈ ల్యాండ‌ర్ నుంచి ప్ర‌గ్యాన్ రోవ‌ర్ విడివ‌డి చంద్రుడిపై ప‌రిశోధ‌న‌లు చేస్తుంది. ఈ రెండు క‌లిపి చంద్రుడి ర‌హ‌స్యాల‌ను శోధించి ప‌రిశోధ‌న కేంద్రాల‌కు పంపించాల్సి ఉంది.

13 పేలోడ్స్‌
చంద్ర‌యాన్ -2లో మొత్తం 13 పేలోడ్స్ ఉన్నాయి. ఆర్బిట‌ర్‌లో 8, విక్ర‌మ్ ల్యాండ‌ర్‌లో 3, ప్ర‌గ్యాన్ రోవ‌ర్‌లో 2 ఉన్నాయి. వీటిలో మ‌న దేశానికి చెందినవి 5, యూర‌ప్ 3, అమెరికా 2, బల్లేరియా దేశానికి చెందిన ఒక‌టి ఉన్నాయి. చంద్ర‌యాన్ -2కు ప్ర‌యోగానికి రూ. 978 కోట్లను ఇస్రో ఖ‌ర్చు చేసింది. ఇందులో రూ. 375 కోట్ల‌తో రాకెట్‌, రూ. 603 కోట్ల వ్య‌యంతో ఆర్బిట‌ర్‌, ల్యాండ‌ర్‌, రోవ‌ర్ల‌ను ఇస్రో త‌యారు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here