Home ఎడ్యుకేషనల్/జాబ్స్ నాథూరామ్‌ గాడ్సేను అంబేద్క‌ర్ నిజంగా మెచ్చుకున్నారా..?

నాథూరామ్‌ గాడ్సేను అంబేద్క‌ర్ నిజంగా మెచ్చుకున్నారా..?

248
0
  • వికాస్ రుషి

నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి సాధ్వీ ప్ర‌జ్క్షాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు సంఛ‌ల‌నం క‌ల్గించాయి. నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ ఆమె వ్యాఖ్య‌లు చేయ‌డంతో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో సాధ్వీ క్షమాప‌ణ‌లు చెప్పారు. ఇప్పుడు తాజాగా గాడ్సేను ప్ర‌జ్ఞ ఒక్క‌రే కాదు అంబేద్క‌ర్ కూడా మెచ్చుకున్నారంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు చ‌క్క‌ర్లు కొడ్తున్నాయి. అయితే గాడ్సేను అంబేద్క‌ర్ నిజంగానే మెచ్చుకున్నారా..? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గాంధీ హ‌త్య జ‌రిగిన త‌రువాత దేశానికి గాంధీ ఎంతో సేవ చేశాడ‌ని తాను వ్య‌క్తిగ‌తంగా అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టుగా అంబేద్క‌ర్ పేర్కొన్నారు. అయితే ఆయ‌న తీసుకున్న‌నిర్ణ‌యాలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయ‌ని చెప్పుకొచ్చారు. చెడు నుంచి కూడా మంచి జ‌రుగుతుంది అంటూ అంబేద్క‌ర్ వ్యాఖ్యానించిన‌ట్టుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అదే విధంగా ఈ ఘ‌ట‌న ప్ర‌భావం నుంచి ప్ర‌జ‌లు దేశం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది. భ‌విష్య‌త్‌లో మంచే జ‌రుగుతుంది అని వ్యాఖ్యానించారు.

గాంధీ.. అంబేద్క‌ర్ మ‌ధ్య విబేధాలు

గాంధీకి, అంబేద్క‌ర్‌కు మ‌ధ్య విబేధాలున్న సంగ‌తి మాత్రం ప్ర‌పంచానికి తెలుసు. ఈ విబేధాల అంశాన్ని కాంగ్రెస్ అంగీక‌రించ‌దు. అలాంటిదేమీ లేదంటారు. గాంధీ, అంబేద్క‌ర్ మ‌ధ్య విబేధాల‌ను క‌త్తి ప‌ద్మారావు ర‌చించిన ప‌లు పుస్త‌కాల్లో వివ‌రించారు. అంబేద్క‌ర్ పుస్త‌కాల‌ను కొన్నింటిని ఆయ‌న తెలుగులోకి అనువ‌దించారు. పైగా ఆయ‌న అంబేద్క‌రిస్టు. ఆయ‌న రాసిన అంబేద్క‌ర్ సూర్యుడు పుస్త‌కంలో గాంధీ, అంబేద్క‌ర్ మ‌ధ్య నెల‌కొన్న‌ విబేధాల‌ను విపులంగా వివ‌రించారు. సైద్ధాంతికంగా గాంధీని, కాంగ్రెస్‌ను ఏ విధంగా ఎదుర్కున్నారో కూడా చెప్పారు. ఈ పుస్తకంలోని 32వ పేజీలోని రెండో పేరా ఒక్క‌టి ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను. ఇది 1931లో బ్రిటీష్ పాల‌కులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ స‌మావేశానికి సంబంధించిన‌ది

  • దుర‌దృష్ట‌వ‌శాత్తు కాంగ్రెస్ గాంధీని రౌండ్ టేబుల్ స‌మావేశానికి త‌న ప్ర‌తినిధిగా ఎన్నుకున్న‌ది. భార‌త‌దేశ అదృష్టాన్ని రూపొందించ‌డంలో గాంధీ ప‌నికిమాలిన మ‌నిషి. ఐక్యం చేసే వ్య‌క్తిగా గాంధీ రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో అత‌ని అల్ప‌బుద్ధి బ‌య‌ట‌ప‌డింది. వింతైన సంకీర్ణ వ్య‌క్తిగా నిరూపించుకున్నారు. ఈ స‌మావేశంలో అంటరాని వాళ్ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు. మా ఇద్ద‌రి మ‌ధ్య అది అన్ని ర‌కాల యుద్ద‌మే అయింది*—అంబేద్క‌ర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here