Home breaking news నాకు గవర్నర్​ రెండు లవ్​ లెటర్లు రాశారు: ముఖ్యమంత్రి

నాకు గవర్నర్​ రెండు లవ్​ లెటర్లు రాశారు: ముఖ్యమంత్రి

161
0
నాకు గవర్నర్​ రెండు లవ్​ లెటర్లు రాశారు: ముఖ్యమంత్రి

గవర్నర్​ తనకు రాసిన లేఖలను లవ్​ లెటర్లుగా ముఖ్యమంత్రి కుమారస్వామి అభివర్ణించారు. అవిశ్వాసం విషయంలో గవర్నర్​ తనకు రెండు లవ్​ లెటర్లు రాశారని ఆయన వెల్లడించారు. లెటర్లు రాయడాన్ని ప్రస్తావిస్తూ.. సభ నిర్వహించే తీరును ఢిల్లీ నిర్దేశించలేదన్నారు. విశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో గవర్నర్​ తనకు రాసిన లేఖలను లవ్​ లెటర్లుగా పేర్కొన్నారు. గవర్నర్‌ పంపిన లేఖ నుంచి తనను కాపాడాలని స్పీకర్‌ను ఉద్దేశించి కుమారస్వామి కోరారు. గవర్నర్‌కు తాను గౌరవం ఇస్తానని, ఆయన నుంచి తనకు వచ్చిన రెండో లవ్‌ లెటర్‌ తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయం గవర్నర్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటకలో సంకీర్ణ సర్కారు.. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశెపెట్టిన సంగతి తెలిసిందే. కాగా కర్ణాటకానికి ఇంకా తెరపడలేదు. సర్కార్‌ బలపరీక్షపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న క్రమంలో సభ సోమవారానికి వాయిదా పడింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ  గందరగోళం మధ్యే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. బలపరీక్షను చేపట్టాలని పేర్కొంటూ గవర్నర్​ చేసిన సూచనను తోసిపుచ్చడాన్ని బీజేపీ పక్షనేత యెడ్యూరప్ప.. అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వాస పరీక్షపై బీజేపీ చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ విశ్వాస తీర్మానంపై ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here