Home breaking news నడ్డా అన్నందుకా.. పత్రికల్లో వచ్చినందుకా..! కేటీఆర్ కోపానికి కారణమేంటో..?

నడ్డా అన్నందుకా.. పత్రికల్లో వచ్చినందుకా..! కేటీఆర్ కోపానికి కారణమేంటో..?

307
0

కేటీఆర్​కు కోపమొచ్చింది. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను చెడా మడా అనేశారు. నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ ఎన్ని అనాలో అన్ని అనేశారు. ఇంతకు కేటీఆర్​కు అంత కోపమెందుకు వచ్చిందో..? నడ్డా అన్నందుకా..? పత్రికల్లో పెద్దగా వచ్చినందుకా..?

మొన్న బీజేపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు (కాబోయే అధ్యక్షుడు) జేపీ నడ్డా వచ్చేసీ.. తెలంగాణ సర్కారును దునుమాడి వెళ్లారు. కమీషన్​ కాకతీయ, కమీషన్​ భగీరథ అంటూ తెలంగాణ సర్కారు మొత్తం అవినీతికి పాల్పడిదంటూ చెప్పుకొచ్చారు. ఇవే సంగతులు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్నోమార్లు చెప్పినా.. మన పత్రికలకు అనవు కదా. చెప్పింది జాతీయ నాయకుడు కాబట్టి..పత్రికల్లో పతకా శీర్షికల్లో వచ్చింది. నడ్డా అన్నందుకు కోపమొచ్చిందో.. పత్రికల్లో పెద్దగా వచ్చినందుకు కోపమొచ్చిందో తెలియదు కానీ.. టీఆర్​ఎస్​ కార్య నిర్వాహక అధ్యక్షుడు (కాబోయే అధ్యక్షుడా..? సీఎమ్మా..?) కేటీఆర్ ఆవేశంతో​ ఊగిపోయారు. నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ ఎన్ని అనాలో అన్నీ అన్నారు. తమను నీతి అయోగ్​ మెచ్చుకున్నదని అది మీకు కన్పించడం లేదా.? 11 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పథకాలను చూసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. పథకాలు రచించినా.. అవి బాగానే ఉంటాయి అందుకే పథకం బాగుందని ఎవరైనా చెప్పేస్తారు. ఎలా అమలు జరుగుతుందన్నదే చూడాలి. ఏ స్థాయిలో అమలు జరుగుతుందో అందరికీ తెలిసిందే.

ఆయుష్మాన్​ భారత్​ కంటే ఆరోగ్యశ్రీ మేలంటూ చెప్పుకున్నారు బాగానే ఉంది. రెండింటిని కలిపి అమలు చేసే అవకాశమున్నా.. ఎందుకు చేయడం లేదన్నదానికి జవాబు లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదన్నది చెప్పరు. కేంద్రం నుంచి సాయం, సహకారం అవసరం లేదన్న కేటీఆర్​.. పోయినేడాది ప్రధాని మోదీని తండ్రి కొడుకులు పోటీ పడి  ఎందుకు కలిశారో చెప్పరేం. రాష్ట్ర సాయానికి కాకుంటే.. దేని కోసం.? రాజకీయ సాయం కోసమా..? నాగార్జున సాగర్​, శ్రీశైలం నిండుతుంటే బీజేపీకి కడుపు మండుతుందంటూ చెప్పడం నవ్వు పుట్టిస్తోంది. ఆ రెండు ప్రాజెక్టులు (నిర్మాణం పక్కన పెడితే) నిండడం వెనుక వరదల కృషి తప్ప.. టీఆర్​ఎస్​ కృషి ఎక్కడుందో అర్థం కాదు. ఇక మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్​, మల్లారెడ్డి మాత్రం ఎందుకు మాట్లాడుతారో తెలియదు కానీ.. ఇది కరుడుకట్టిన తెలంగాణ ఉద్యమకారుల అడ్డా..ఇక్కడ టీఆర్​ఎస్​ ఉంటుంది. ఏ పార్టీని అడుగుపెట్టనీయమంటూ చెప్పుకోవడం జోక్​లా లేదు. ఉద్యమ సమయంలో వీరిద్దరూ ఎక్కడ.. ఏ పార్టీలో ఉండి ఏమాట్లాడారో అందరికీ తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here