Home ఎడ్యుకేషనల్/జాబ్స్ దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించనోళ్లు స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు

దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించనోళ్లు స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు

217
0
దేశ స్వాతంత్ర్యాన్ని గుర్తించని వారు.. స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు

‌‌- వికాస్​ రుషి

ఈ మేధావులు కొత్తగా పుట్టుకొని రాలేదు. వాళ్లేం కొత్తొళ్లూ కాదు. అయితే మేధావులుగా పేరు చెప్పుకునే వాళ్లలో చాలా మంది భారత స్వాతంత్య్రాన్ని దినోత్సవాన్ని గుర్తించరు. కానీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వం గురించి ఉపన్యాసాలు దంచికొడుతారు. వీళ్లలో కొందరు బహిరంగంగానే ఉంటారు. మరికొందరు అండర్​గ్రౌండ్లో ఉంటారు. దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించడం.. గుర్తించక పోవడం ఎవరిష్టం వాళ్లది. ఇందులో తప్పేమీ లేదు. కానీ, స్వాతంత్య్రాన్ని గుర్తించని వాళ్లు.. స్వేచ్ఛ గురించి మాట్లాడడమే ఇక్కడ విచిత్రం. ఈ మేధావులనే వాళ్లు.. తాముండే చోట లేదా.. కార్యాలయం లేదా ఇంకోచోట ఉన్నా.. వారు పంద్రాగస్టు రోజున మూడు రంగుల జెండాను ఆవిష్కరించరు. కానీ స్వేచ్ఛ గురించి మాత్రం మాట్లాడుతారు. బ్రిటీష్​ వలస పాలకుల చేతుల్లోంచి భారతీయులు స్వేచ్ఛ స్వాతంత్య్రాన్ని పొందారు. ఇది అందరూ ఎరిగిన సత్యం. ఇది తెలిసి కూడా గుర్తించని వారు.. ఇప్పుడు ఇక ముందు పాలించిన వారు నియంతృత్వంగా పాలిస్తున్నారు.. వారి నుంచి విముక్తి పొందాలని నినదించడం ఏమిటీ..? ముందు మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని గుర్తించు. తరువాత ఈ పాలకుల చేతుల్లోంచి స్వాతంత్య్రాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది. బ్రిటీష్​ వలస పాలకుల చేతుల్లోంచి స్వాతంత్య్రం వచ్చినందునే.. చట్టాలు మారినందునే.. వీళ్లు కూడా మాట్లాడగలుగుతున్నారు.

ఈ స్వాతంత్య్రం లేకుంటే మాట్లాడే అవకశామెక్కడిదీ..? ఈ దేశ స్వాతంత్య్రం గురించి మాట్లాడని వాళ్లు.. చైనా, రష్యా గురించి మాత్రం గొప్పలు చెప్పుకుంటుంటారు. ఆ దేశాల దురాక్రమణ గురించి మాత్రం మాట్లాడరు. ఇప్పుడీ మేధావులకు హఠాత్తుగా కశ్మీర్​పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఆర్టికల్​ 370 ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్​ 370 కారణంగా ఆ రాష్ట్ర ప్రజలకు.. కొందరు వ్యక్తులకు కాదు.. ప్రజలకు ఇన్నేళ్లలో ఒనగూరిన లబ్ధి ఏమిటో చెప్పిన తర్వాత.. రద్దు గురించి ప్రశ్నిస్తే బాగుండేదీ. అది మాట్లాడరు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ. అదంటే ఈ లౌకికవాదులకు గిట్టదు. గిట్టని పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రానా.. తీసుకున్న నిర్ణయాలన్నీ.. వ్యతిరేకిస్తే ఎలా..? ఆర్టికల్​ 370 రద్దు చేస్తే అక్కడి ప్రజలకు కలిగే నష్టమేంటీ..? స్వేచ్ఛ.. స్వాతంత్యాలా.? ఇన్నేళ్లలో ఎప్పుడైన కశ్మీరీ ప్రజలు అనుభవించారా..? ఎప్పుడు తుపాకుల మధ్య బిక్కు బిక్కుమంటూ జీవించడమే తప్ప ఏనాడు స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు ఒక మార్పు.. సాధిస్తాం. ఇందుకోసమే ఆర్టికల్​ 370 రద్దు చేశామని చెబుతోంది ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ. మార్పు సాధ్యమవుతుందా..? లేదా..? అన్నది చూడాలి కానీ అది రద్దు చేయకూడదంటే ఎలా..? లౌకికవాదులుగా చెప్పుకునే మేధావుల్లారా..? ఇక్కడ మతం, రాజకీయాలు, పార్టీలు కాదు.. కొందరు ప్రజల కోణంలో కాకుండా ప్రజలందరి కోణంలో అలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here