Home breaking news దారుణం.. విడాకులు తీసుకున్న భార్యను అతి కిరాతకంగా..

దారుణం.. విడాకులు తీసుకున్న భార్యను అతి కిరాతకంగా..

250
0
ఫొటో ఇంటర్నెట్​ నుంచి

విజయవాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నది. విడాకులు తీసుకున్న భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. ఆ తరువాత ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు సదరు భర్త. విజయవాడలోని సత్యనారాయపురంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురంలోని శ్రీనగర్​ కాలనీకి చెందిన ప్రదీప్​.. అదే ప్రాంతానికి చెందిన మణిక్రాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినా.. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మణిక్రాంతి.. తన భర్త ప్రదీప్​పై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. చివరకు అతడితో వేరుపడి విడాకులు కూడా తీసుకున్నది. ఇది నచ్చని ప్రదీప్​..ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపం కాస్తా కసిగా మారి.. మణిక్రాంతిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు ప్రదీప్​. ఆ తరువాత ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. తలను తీసుకొని వీధిలోకి నడుచుకుంటూ రావడంతో.. గమనించి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు మణిక్రాంతి తలను బుగమేరులో పడేసిన ప్రదీప్​.. సత్యనారాయణపురం పోలీస్​స్టేషన్లో లొంగిపోయాడు. తనను ఇబ్బందులు పెట్టినందుకే భార్య తలనరికి చంపానని ప్రదీప్​ చెప్పుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here