తెలంగాణ ఆర్టీసోళ్లు సమ్మె చేస్తమని సర్కారుకు నోటీసిచ్చారు. ఇప్పుడు 5 తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించేశారు. దసరా ముందు అది కూడా పబ్లిక్ అత్యవసరమైన టైంలో సమ్మెకు దిగారు. ఆ మధ్య ఆంధ్ర ఆర్టీసోళ్లు సమ్మెకు దిగుతామని సర్కారుకు ఆల్టిమేటం ఇచ్చారు. ఆళ్ల ముఖ్యమైన డిమాండ్‌ను సీఎం జగన్ పరిష్కరించారు. ఆర్టీసీని సర్కార్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక్కడితో అక్కడ సమస్య పరిష్కారమైతే.. ఇక్కడ మొదలైంది అసలైన సమస్య గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)కు. ఇది టీఆర్ఎస్కు అనుబంధ సంఘమే. గతంలో కొన్ని సంఘాలు సమ్మెకు దిగుతామని ప్రకటించినా.. గుర్తింపు సంఘం వెనుకే ఉంది.
ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతామని ప్రకటించి.. నోటీసిచ్చింది. 4వ తేదీనా చర్చలకు రమ్మని యాజమాన్యం పిలుపిచ్చింది. కానీ.. చర్చల సంగతి పక్కన పెట్టి.. 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని టీఎంయూ నేతృత్వంలోని జేఏసీ ప్రకటించింది. ఇక్కడ అర్థం కాని ముచ్చటేంటంటే.. చర్చలకు పిలిచిన తర్వాత సమ్మె తేదీ ప్రకటించడమే. 4న చర్చలు ఫెయిలైతే.. 5 నుంచి సమ్మెకు పిలుపివ్వడం వరకూ బాగానే ఉంటుంది. చర్చలకు పిలిచిన తర్వాత సమ్మెకు పిలుపివ్వడమే. దీనివెనుక ఏమన్నా.. మతలబు ఉన్నదా అని ఆర్టీసీ కార్మికుల అనుమానం. ఎందుకంటే సమ్మెకు పిలుపిచ్చింది అధికార పార్టీ అనుబంధ సంఘం కాబట్టి. సో ఏమవుతుందో చూడాలి.
డిమాండ్లు ఇవే..
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
బకాయిలు చెల్లించాలి
పట్టణ ప్రాంతాల్లో నష్టాలు భరించాలి
ఆర్టీసీని సర్కార్‌లో విలీనం చేయాలి
ఖాళీలను భర్తీ చేయాలి
మోటార్ టాక్స్ రద్దు చేయాలి
తార్కాక ఆస్పత్రిలో వైద్య సదుపాయం కల్పించాలి