Home breaking news తోక వాళ్లయితే కుక్క ఎవరా.? సంజయ్ ఇ​దేం ప్రశ్న.?

తోక వాళ్లయితే కుక్క ఎవరా.? సంజయ్ ఇ​దేం ప్రశ్న.?

287
0

కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ నిన్న ఒక ప్రశ్న వేశారు అదేంటంటే.. వాళ్లు తోకలైతే.. కుక్క ఎవరూ..? అని. ఇటువంటి ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎవరూ వేసి ఉండరు. ఎందుకంటే.. కుక్క వెనుకే తోక ఉంటుంది కాబట్టి. కానీ ఈ బీజేపీ సంజయ్​ ఏంటీ..? తోకలు వాళ్లయితే..? కుక్క ఎవరంటూ తిక్క ప్రశ్న వేశారన్న అనుమానం చాలా మందికి కలిగి ఉండొచ్చు.

అసలు విషయమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్​.. కుక్క తోకను ఊపుతుందా? లేక తోక కుక్కను ఊపుతుందా.? అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఉద్యోగులు తరచూ తమ హక్కుల విషయంలో స్టేట్​మెంట్లు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్​పై విధంగా మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం మమ్ములను ​ ‘తోకలు’ అంటారా..? అని రభస మొదలైంది. సీఎం కేసీఆర్​ ఎలా మాట్లాడుతారో మనకు తెలిసిందేగా.. ఉద్యోగుల ఆందోళన వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ విధంగా వ్యాఖ్యానించినట్టుగా చాటు మాటుగా టీఆర్​ఎస్​ లీడర్లు కూడా అంటున్నారనుకో.

అయినా సరే.. మమ్ములను తోకలంటారా..? అంటూ ఉద్యోగులు కోపంతో ఉన్నారు. ఈ సమయంలో కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఒక స్టేట్​మెంట్​ ఇచ్చారు. ‘ఉద్యోగులు తోకలు కారు. ఉద్యమకారులు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించినవారు. వాళ్లను పట్టుకొని తోకలంటావా..?’ అంటూ ప్రశ్నించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. రాష్ట్రం పొందిన తర్వాత పదవులు పొందిన కొందరు ఉద్యోగులే తోకలని ఇప్పుడు పదవుల్లో ఉన్న వారి గురించి కామెంట్​ చేస్తూనే… ‘ఉద్యోగులు తోకలైతే..? మరి కుక్క ఎవరు..? ఈ విషయం కేసీఆర్​ చెప్పాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది విన్న వాళ్లంతా సంజయ్​ ఇదేం ప్రశ్న అంటున్నారనుకో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here