Home breaking news తెలంగాణ సర్కారుకు చెమటలు పట్టించిన హైకోర్టు

తెలంగాణ సర్కారుకు చెమటలు పట్టించిన హైకోర్టు

93
0

తెలంగాణ ఆర్టీసీకి, ఆ సంస్థ ఇన్​చార్జ్​ ఎండీ సునీల్​  శర్మకు హైకోర్టు చెమటలు పట్టించింది. అని అందరూ అనుకుంటున్నారు. అసలు కథ మాత్రం.. ఈ చెమటలు తెలంగాణ సర్కారుకే పట్టించింది  హైకోర్టు. ఆర్టీసీ  సమ్మెపై. ఈ  రోజు జరిగిన విచారణలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఘాటుగా సూటిగానే ఉన్నాయి. ఇవి చూడడానికి ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీని ఉద్దేశించినట్టు ఉన్నా.. నేరుగా అవి సీఎం కేసీఆర్​కే తగిలినట్టే అని అంటున్నారు. సదరు ఎండీ సమర్పించిన నివేదిక సీఎం సహా మినిష్టర్​ను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మినిష్టర్​ను తామే తప్పుదోవ పట్టించినట్టు ఎండీ తన నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటన తాను మూడు రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా ఎక్కడా చూడలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి.  

సీఎం, మినిష్టర్లను, తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తారా.? అని ఘాటుగా వ్యాఖానించింది. మీ బాస్​నే తప్పుదోవ పట్టించిన మీరు.. మాకు నిజాలు చెబుతున్నారంటే ఎలా నమ్మాలని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఎండీని ఎలా కొనసాగిస్తున్నారని సర్కారకు చురకలేసింది. (ఈయనే సమర్ధుడని ఇటీవలే సీఎం వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి.) జీహెచ్​ఎంసీ నుంచి ఆర్టీసీకి ఎలాంటి సొమ్ము రావాల్సిన అవసరం లేదన్న మీరే.. ఆర్టీసీకి జీహెచ్​ఎంసీ సొమ్ము బకాయి ఉందని ఎలా చెప్పారంటూ నిలదీసింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు… ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్న మాట వినే ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఏ ఒక్కరూ.. ఏ స్థాయి అధికారి అయినా.. ముందుకు కదలరని ప్రచారం. ఇందులో నిజా నిజాలు తెలిసి తెలియనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here