Home breaking news తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చందమామ ‘కతే’నా..?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చందమామ ‘కతే’నా..?

282
0
ఫొటో: గూగుల్​ నుంచి సేకరణ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక చందమామ కతేనా.? ఇందులో ఎలాంటి అనుమానమక్కర్లేదు. ఇప్పుడు సెప్టెంబర్​ 4న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పుకుంటున్నారు. జరుగుతుందా..? అంటే జరుగుతుంది. జరగదా..? అంటే జరగదు అన్నట్టుగా ఉంది. కేసీఆర్​ అనుకుంటే జరుగుతుంది. విస్తరిద్దామని అనుకొని కూడా సర్కారు సాఫిగా సాగుతుంది. విస్తరించడమెందుకు.. పార్టీలో గబ్బులేపుడెందుకని  ఊకున్నా ఊకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మనసులో ఏముందో ఆయన అతి దగ్గరగా ఉండేది ‘టీ న్యూస్’​ సంతోష్​ అదే రాజ్యసభ సభ్యుడు. ఈయనకైనా తెలుస్తుందా..? అనుమానమే.

టీఆర్​ఎస్​ మొదటి సర్కార్​లో కూడా మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా స్టోరీలు వచ్చాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిజమైనట్టుగా కన్పించలేదు. రెండోసారి సర్కారు వచ్చిన తర్వాత తక్కువేం రాయలేదు. సీఎం కేసీఆర్​తో పాటు మహమూద్​ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. వీరిద్దరి కేబినెట్​ దగ్గరదగ్గరగా రెండు నెలలు సాగింది. ఆ తర్వాత కేసీఆర్​ అనుకున్నారు.. బంగారు తెలంగాణ(బీటీ) బ్యాచ్​కు పెద్ద పీట వేశారు. ఉద్యమ తెలంగాణ బ్యాచ్​ను కాస్తా ఆగమని చెప్పారు. ఏదో ఈటల రాజేందర్​కు మాత్రం సరే ఉండండి అన్నట్టుగా చివర్లో ఆఫర్​ ఇచ్చారు. ఈటల మంత్రి పదవి ఊడుతుందంటూ బీటీ పత్రికల్లో స్టోరీలు వస్తున్నాయి. నిజమెంతో చూడాలి.

ఇప్పుడు మళ్లా మంత్రివర్గ విస్తరణ అంటూ స్టోరీలు వస్తున్నాయి. సెప్టెంబర్​ 4న కచ్చితంగా విస్తరణ ఉంటుంది. ఇదే కత రీలు తిరుగుతోంది. మీడియాలో పుంఖాను పుంఖానులుగా స్టోరీలు వస్తున్నాయి. పోయిన సారి రాసిన వాటిల్లో నిజం కాకపోయే సరికి సరుకు అమ్ముకోవడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి రాస్తున్నరన్న అప్రతిష్టను పేపరోళ్లు మూటగట్టుకుంటున్నారు. ఈళ్లకు ఏదీ తెలియదనుకోవడం కూడా కరెక్ట్​ కాదు. ఎందుకంటే.. గత సర్కార్ల హయాంలో ఎన్నో రాశారు. అందులో ఎక్కువగా నిజం కూడా అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందన్న పేపర్లో వచ్చింది. రెండ్రోజుల్లో ఆయన దిగి.. కిరణ్​కుమార్​రెడ్డి ఎక్కేశారు. ఈ వార్త తెలిసి రాయలేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పేపర్లోని ఒక హెచ్​వోడీని పీకేశారు. సరే ఇదంత గతం. కేసీఆర్​ సర్కార్​ విషయంలో.. ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవడంలో మాత్రం పేపర్లు కాదు కాదు హోల్​ మీడియా కూడా ఫెయిలే. అనుకుంటాం కానీ చందమామ కతలు సూపర్​గా ఉంటాయని చదవిన మనకు కూడా తెలుసుగా.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here