Home breaking news తెలంగాణ కొత్త పాలసీలో వాకింగ్ వైన్స్ షాపులు

తెలంగాణ కొత్త పాలసీలో వాకింగ్ వైన్స్ షాపులు

59
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి సేకరణ

కొత్త మందు పాలసీలో భాగంగా తెలంగాణలో వాకింగ్​ వైన్స్​ షాపులు ఏర్పాటు కానున్నాయి. వాకింగ్​ వైన్స్​ షాపు అనగానే.. మొబైల్​ వైన్స్​ షాపు అనుకుంటే చీప్​ లిక్కర్​లో కాలేసినట్టే. మందు షాపులు అనగానే.. షాపు ఎదుట ఇనుప జాలీలు.. లోపల నుంచి షాపులో పని చేసే ఇచ్చే మందు బాటిల్​ తీసుకొని వెళ్లి.. పక్కనే ఉన్న పర్మిట్​ రూంలో తాగడమో.. లేకుంటే ఖాళీగా జాగాకు వెళ్లి తాగడమో.. చివరకు ఇంటికి తీసుకోవడమో..జరుగుతుంది. ఇప్పుడు వాకింగ్​ వైన్స్​ షాపు అంటే..  సూపర్​ మార్కెట్​ తరహాలో ఏర్పాటు చేస్తారన్నట్టు. షాపు ఎదుట ఇనుప జాలీలు ఉండవు. సూపర్​ మార్కెట్​ తరహాలో.. అన్ని రకాల మందు స సీసాలను అందంగా డిస్​ప్లే చేస్తరు. మందు కొనుక్కునే వ్యక్తి నేరుగా షాపులకు పోయి.. మొత్తం తిరగవచ్చు. డిస్​ప్లేలో ఉన్న మందు సీసాలను చూడొచ్చు. అందులో మంచి కంపెనీలోని తనకు నచ్చిన మందు సీసాను చూసి కొనుక్కోవచ్చు. నచ్చిన మందు కొనుక్కున్నామని అక్కడే తాగుతామంటే కుదరదు. కొనుక్కోని వెళ్లడమే. ఇటువంటి షాప్​ ఏర్పాటు చేయాలంటే షాపు దక్కించుకున్న వ్యాపారీ.. ఎక్స్​ట్రాగా రూ. 5 లక్షలు ఎక్సైజ్​ శాఖకు కట్టాలి.

కమీషన్​ తగ్గింపు

ఇక్కడ మందు షాపు ఓనర్లకు సర్కారు నష్టం చేయనుంది. మందుపై కమీషన్​ను తగ్గించింది. బీర్లపై ఇప్పటి వరకూ 25 శాతం ఉండగా.. కొత్త విధానంలో దానిని 20 శాతానికి తగ్గించింది. కొత్తగా ఏడాదికి రూ. 5 లక్షలు ఎక్సైజ్​ టాక్స్​ విధించింది. దీని వల్ల షాపు పొందిన వ్యాపారి అధనంగా రెండేళ్లకు కలిపి రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సొమ్ము రెండో వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సదరు వ్యాపారీ ఒప్పంద పత్రం కూడా రాయాల్సి ఉంటుంది. రెండు నుంచి మూడు వార్డులను కలిపి క్లష్టర్​ కూడా ఏర్పాటు చేసింది. దీనివల్ల గతంలోనే మద్యం షాపు ఏర్పాటు చేసిన భవనం అద్దెకు లభించకున్నా.. ఈ వార్డులల్లో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల గత మద్యం వ్యాపారులు.. కొత్త వారికి అడ్డంకులు కల్పించే అవకాశం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here