Home breaking news తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఎండీ ‘రాజకీయ’ అఫిడవిట్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఎండీ ‘రాజకీయ’ అఫిడవిట్

96
0

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇప్పుడు పూర్తిగా రాజకీయమై పోయింది. ఇప్పుడు అధికారులు కూడా రాజకీయమై పోయారు. వాళ్లు రాజకీయ నాయకులై పోయారు. అందుకే సమ్మెపై  రాజకీయ వ్యాఖ్యలున్న అఫిడవిట్​హైకోర్టులో  దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆర్టీసీ యూనియన్లు. ప్రతిపక్షాలపై కుమ్మక్కై పోయాయని ఆరోపణలు చేశారీ అఫిడవిట్​లో. పక్కా రాజకీయ నాయకుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ సునీల్​ శర్మ కూడా హైకోర్టులో దాఖలు చేసిన స్పెషల్​ అడిషనల్​ అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఒకసారి సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్​లో ఏం పేర్కొన్నారో ఒకసారి చూద్దాం.

‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూలి్చవేసేందుకు యూనియన్‌ ప్రయత్నిస్తోంది. అందుకే విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోంది. యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయి.  ఇప్పుడు వారంత వచ్చిన విధుల్లోకి తీసుకోవడం కూడా కష్టమే. సమ్మె చట్ట విరుద్ధమం. ని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్‌ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్‌.. ఈ డిమాండ్​ను ప్రస్తుతానికి పక్కకు పెట్టింది. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు  లేకపోలేదు. ’ ఇవే వ్యాఖ్యలు హైకోర్టులో సునీల్​శర్మ దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొన్నారు.  ఇంతకి మించి రాజకీయ వ్యాఖ్యలు ఇంకేమున్నాయని ఆర్టీసీ యూనియన్లు, రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here